GST raids on Tollywood actress Lavanya Tripathi
GST raids on Tollywood actress Lavanya Tripathi

(Tollywood actress Lavanya Tripathi) లావణ్య త్రిపాఠి…’అందాల రాక్షసి’గా తెలుగు ఇండ్రస్ట్రీలో అడుగుపెట్టి..ఎందరో కుర్రాళ్ల హృదయాలు కొల్గగొట్టింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో తన నటనతో, అందంతో అదరగొట్టింది. చివరగా మెగాప్రిన్స్ వరణ్ తేజ్‌తో అంతరిక్షంలో మెరిసింది. ప్రస్తుతం కుర్రహీరో నిఖిల్ సరసన ‘అర్జున్ సురవరం’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఇటీవలె విడుదలై ఘన విజయం సాధించింది.

ఇక ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్‌లోని లావణ్య త్రిపాఠి ఇంటిపై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు దాడులు చేశారు. నటి ఇంటిపై దాడులు జీఎస్టీ అధికారులు దాడులు చేయడంతో సినిమా ఇండస్ట్రీ షాక్ అయ్యింది. ఆమె ఇంట్లో దాడులు జరుగుతున్నాయని తెలుసుకున్న నటి లావణ్య త్రిపాఠి షూటింగ్ రద్దు చేసుకొని హుటాహుటిన ఇంటికి చేరుకుంది. ఒక్క నటి ఇంట్లోనే కాకుండా హైదరాబాద్ నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో జీఎస్టీ టీమ్ దాడులు చేస్తున్నది. చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలతో పాటు ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీల్లోనూ ఈ టీమ్ దాడులు చేస్తున్నది. ఈ ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి.

డీజీజీఐ సోదాల్లో కోట్ల రూపాయల్లో సర్వీస్‌ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలె విడుదలైన నిఖిల్ చిత్రం `అర్జున్‌సురవరం` పర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం లావణ్య చేతిలో కూడా సినిమాలు లేవు, అర్జున్ సురవరం హిట్ అయితేనే ఆమె కెరీర్ లో ఏదైనా మార్పు రావొచ్చు. గతంలో ఆమె నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం బాగానే హిట్ అయినప్పటికీ ఈ భామకి ఎందుకో పెద్దగా సినిమాలు లేవ్‌. ఈ అర్జున్ సురవరం తర్వాత అయినా ఎవరన్నా ఆఫర్లు ఇస్తారేమో వేచి చూడాలి మరి.