Guntur Doctors who performed brain surgery showing Bigg Boss Telugu 4

guntur brain surgery: బిగ్ బాస్ బిగెస్ట్ రియాలిటీ షో .. ఈ షో ప్రస్తుతం తెలుగులో 4 వ సీజన్ జరుగుతుంది. బిగ్ బాస్ షోకి కోట్లు పెట్టి నిర్వహించినా దక్కని ప్రమోషనల్ మెటీరియల్ ఒకే ఒక్క బ్రెయిన్ ఆపరేషన్‌తో లభించింది. ఓ వ్యక్తికి వైద్యులు బిగ్ బాస్ షో ను చూపిస్తూ బ్రెయిన్ కి ఆపరేషన్ చేసేశారు. గుంటూరు కొత్తపేటలోని బ్రింద న్యూరోసెంటర్‌‌ డాక్టర్లు అరుదైన శస్త్ర చికిత్స గురించి తెలుసుకోవాల్సిందే.

ఆ వివరాల్లోవెళితే.. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం, పాటిబండ్ల గ్రామానికి చెందిన యువ సాప్ట్‌వేర్ ఇంజనీర్ బత్తుల వరప్రసాద్‌ బెంగళూరులోని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అతనికే నాలుగేళ్ల క్రితం మెదడులో ట్యూమర్‌ ఏర్పడటంతో హైదరాబాద్‌లోని ప్రయివేట్‌ హాస్పిటల్‌ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి కణితను తొలగించారు. మళ్లీ కొన్ని నెలల నుంచి ఆయనకు తరచుగా ఫిట్స్ వస్తున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. గుంటూరు నగరంలోని బ్రిందా న్యూరో సెంటర్‌కు తరలించారు. అతన్ని పరీక్షించిన సీరియర్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి.. వరప్రసాద్ మెదడులోని ఫంక్షనల్‌ ఏరియాలో 3 సెంటీమీటర్ల సైజులో కణిత ఉన్నట్లు యం.ఆర్‌.ఐ. పర్‌ఫ్యూజన్‌ స్కాన్‌ ద్వారా తెలుసుకున్నారు. దీనితో మళ్లీ సర్జరీ చేసి తొలగించాలని నిర్ణయించారు.

ఈ క్లిష్టమైన సర్జరీ జరిగినంతసేపు రోగి సహకరించాల్సి ఉంటుందని చేతులు వేళ్లు కదిలించాలని అందువల్ల మత్తు మందు ఇవ్వడం కుదరకపోవడంతో.. మెదడు ప్రాంతానికే మత్తు మందు ఇచ్చి మిగతా శరీరమంతా స్పృహలో ఉండేటట్లు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతో అతనికి ఆపరేషన్ అంటే భయం పోగొట్టడానికి తననికి ఇష్టమైన నాగార్జున ‘బిగ్ బాస్ ’ షోని ఆపరేషన్ థియేటర్‌లో లాప్ ట్యాప్‌లో చూపించారు డాక్టర్లు. కొంతసేపు బిగ్ బాస్.. ఆ తరువాత అవతార్ సినిమాలు చూస్తూ డాక్టర్లకు సహకరించాడు వర ప్రసాద్. రోగి వరప్రసాద్కు ఆపరేషన్ చేసిన వైద్యులలో ముగ్గురు గుంటూరు సర్వజన ఆసుపత్రికి చెందిన వారు కావడం గమనించాల్సిన విషయం.

సుమారు గంటన్నర పాటు సీనియర్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ డి.శేషాద్రి శేఖర్, బొమ్మిశెట్టి త్రినాథ్, శ్రీనివాసరెడ్డి వైద్య బృందం శ్రమించి ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నాడని ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ లేవని ప్రకటనలో తెలియజేశారు వైద్యులు. మొత్తానికి బిగ్ బాస్ షో చూస్తూ క్లిష్టమైన ఆపరేషన్‌కు సహకరించి ప్రాణాలను దక్కించుకున్నాడు గుంటూరు సాఫ్ట్ వేర్ వర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ లో అవేక్ బ్రెయిన్ సర్జరీ తామే మొట్టమొదటిసారిగా చేశామని వెల్లడించారు