Guntur Kaaram First Single Update: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు చాలా కాలంగా ‘గుంటూరు కారం’ టీమ్ నుండి అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. మహేష్ బర్త్ డే రోజున కూడా కేవలం రెండు పోస్టర్లు మాత్రమే విడుదల చేసి అభిమానులను నిరాశపరిచారు. సినిమా కథకు సంబంధించి ఎలాంటి వార్తలు లేవు అలాగే మేకర్స్ కూడా సినిమాలో నటి నటుల విష్యం లో మార్పులు చేయడంతో సినిమాపై చాలా అనిశ్చితి ఏర్పడింది.
Guntur Kaaram First Single Update: ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ చిన్న బ్రేక్‌లో ఉందని, త్వరలోనే షూటింగ్‌ను పునఃప్రారంభిస్తామని, హైదరాబాద్‌లోని భూత్ బంగ్లాలో జరగనుందని వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్‌ని కూడా భారీ స్థాయిలో షూటింగ్ చేయటానికి అన్ని రకాలుగా రెడీ చేసినట్టు సమాచారం తెలుస్తుంది. వినాయక్ చవితి సందర్భంగా గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేయడం ద్వారా అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనేది తాజా సమాచారం.
మేకర్స్ నుండి ఫస్ట్ సాంగ్ గురించి అప్డేట్ అధికారకంగా ప్రకటన రావాల్సి వుంది. ‘గుంటూరు కారం’ జనవరి 12, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ రైటర్-డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం చేస్తుండగా, సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. జయరామ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళితో కలిసి SSMB29 భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు.