Guntur Kaaram Shooting Update: 12 ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుండి నటీనటుగా మార్పు అలాగే స్టోరీ విషయంలో మార్పులు చేయటం దానితోపాటు రీసెంట్గా సినిమా షూటింగ్ సంబంధించిన సాంకేతి వర్గంలో కూడా మార్పులు జరగటంతో షూటింగు పూర్తిగా జరగలేదు. అయితే ఈనెల 16 నుండి మళ్లీ కొత్త షూటింగ్ షెడ్యూల్ ని ప్రారంభించారు.
Guntur Kaaram Shooting Update: గుంటూరు కారం మేకర్స్ ఈ సినిమాని జనవరి 12 సంక్రాంతి సందర్భంగా విడుదల కు సిద్ధం చేస్తున్నట్టు ముందుగానే రిలీజ్ డేట్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. 30% షూటింగ్ కూడా కంప్లీట్ కానీ సినిమా సంక్రాంతికి వస్తుందా లేదా అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ కూడా సోషల్ మీడియా కామెంట్స్ రూపంలో అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
అయితే నిన్న జరిగిన మీడియా సమావేశంలో మహేష్ బాబు వీటన్నిటికీ ఒక్క మాటతో సమాధానం ఇచ్చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మహేష్ బాబు ఆన్సర్ ఇస్తూ గుంటూరు కారం సినిమా సంక్రాంతికి తప్పకుండా విడుదల అవుతుందని దానిలో ఎటువంటి మార్పు లేదు అంటూ చెప్పడం జరిగింది. దీనితోపాటు ఈ నెల 16న మొదలుపెట్టిన గుంటూరు కారం షూటింగ్ షెడ్యూల్ గ్యాప్ లేకుండా డిసెంబర్ ఫస్ట్ వరకు సినిమాని కంప్లీట్ చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్టు సమాచారం అందుతుంది.
నాన్ స్టాప్ షెడ్యూల్ లో మహేష్ బాబు ఒక వారం రోజులపాటు గ్యాప్ తీసుకొని విదేశాలకు వెళ్లి వస్తారంటూ ఈ మధ్యలో మిగతా నటీనటుల మీద త్రివిక్రమ్ షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. మొత్తం మీద కొంచెం లేట్ అయినప్పటికీ త్రివిక్రమ్ అలాగే మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో శ్రీ లీల అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు.

గుంటూరు కారం మొదటి సాంగ్ గురించి తమన్ అందించిన ట్యూన్ మహేష్ బాబు ఓకే చేయటంతో.. ఈ మొదటి పాట ఎప్పుడు విడుదలవుతుంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ కూడా ప్రతి నెల ఒక సాంగ్ ని విడుదల చేసి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాలని చూస్తున్నారంట. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.