Homeసినిమా వార్తలుసంక్రాంతి సినిమాల ఓవర్సీస్ బాక్సాఫీస్ టార్గెట్ ఇదే.!

సంక్రాంతి సినిమాల ఓవర్సీస్ బాక్సాఫీస్ టార్గెట్ ఇదే.!

Guntur Kaaram, Saindhav, Hanu Man And Naa Saami Ranga Overseas Box office target details. Guntur Kaaram Overseas Business, Hanu Man Overseas Business.

Guntur Kaaram, Saindhav, Hanu Man And Naa Saami Ranga Overseas Box office target details: ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు పోటీ పడటానికి రెడీగా ఉన్నాయి.. వాటిలో ముందస్తుగా గుంటూరు కారం అలాగే హను మాన్ జనవరి 12న విడుదలకు సిద్ధం కాగా.. జనవరి 13న సైంధవ్ రిలీజ్ అవుతుంది.. దాని తర్వాత 14న నా స్వామి రంగా అంటూ నాగార్జున రాబోతున్నారు.. ఈ సినిమాలన్నీ డిఫరెంట్ జోనర్స్ తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇక సినిమాల బిజినెస్ విషయానికి వస్తే ఆయా హీరోల రేంజ్ ని బట్టి సినిమాల బిజినెస్ కూడా జరిగింది.. అలాగే ఓవర్సీస్ లో అత్యధికంగా మహేష్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంది.. దాని తర్వాత హనుమాన్, సైంధవ్, నా స్వామి రంగా వరుసగా ఉన్నాయి. మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో 12 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా గుంటూరు కారం ఓవర్సీస్ లో 21 కోట్ల బిజినెస్ చేసింది.

ఇక గుంటూరు కారం ఓవర్సీస్ లో హిట్ కొట్టాలంటే దాదాపుగా 5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.. దీని తర్వాత హను మాన్ సినిమాకి ఓవర్సీస్ లో సాలిడ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారము.. అలాగే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 1 మిలియన్ డాలర్లు హను మాన్ మూవీ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వెంకటేష్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా సైంధవ్ కూడా బ్రేక్ ఈవెన్ కి కలెక్ట్ చెయ్యాలి.

ఇక సంక్రాంతి బరిలో ఉన్న చివరి సినిమా నాగార్జున నా స్వామి రంగా సినిమా దాదాపుగా రెండు కోట్ల బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు అంటే బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ రావాలంటే 660 కె డాలర్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈమధ్య ఓవర్సీస్ మార్కెట్లో తెలుగు సినిమాలకు డిమాండ్ బాగానే పెరిగింది దానితోపాటు బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా నమోదు అవుతున్నాయి దీంతో ఈ సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు ఏ మేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తాయో చూడాలి

Guntur Kaaram, Saindhav, Hanu Man And Naa Saami Ranga Overseas Box office target details. Guntur Kaaram Overseas Business, Hanu Man Overseas Business.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY