Guntur Kaaram Latest Shooting Update: 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు (Mahesh Babu) అలాగే త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక కారణంతో షూటింగు ఆగిపోవడం జరుగుతుంది. మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న గుంటూరు కార్ అండ్ ఇప్పుడు మూడు నెలల తర్వాత మళ్లీ షూటింగ్ మొదలు పెట్టడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల విషయంలో త్రివిక్రమ్ శ్రద్ధ తీసుకోవడంతో హీరోయిన్ పూజా హెగ్డే సినిమా నుండి తప్పుకోవడం జరిగింది.
Guntur Kaaram Latest Shooting Update: మొదటిగా తమన్ అలాగే పూజ సినిమా నుండి తప్పుకున్నట్టు ప్రచారం జరిగినప్పటికీ ఆ తర్వాత పూజా మాత్రమే ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు ప్రస్తుతం తెలుస్తుంది. ఈ సినిమాలో శ్రీ లీల సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసింది. ఇప్పుడు శ్రీ లీల మొదటి హీరోయిన్ కాగా రెండో హీరోయిన్ స్థానంలో మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు ఫిలింనగర్ లో టాక్ అయితే వినిపిస్తుంది.
ఇక గుంటూరు కారం షూటింగ్ విషయానికి వస్తే, మహేష్ బాబు సమ్మర్ వెకేషన్ తర్వాత ఈరోజు హైదరాబాద్ శంకర్ పల్లి లో వేసిన షూటింగ్ సెట్లో మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ షూటింగు 20 రోజులు చేసిన తర్వాత మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మరొక పది రోజులు గ్యాప్ తీసుకుని ఆ తర్వాత మళ్లీ అదే సెట్ లో మొదలుపెట్టతారని సమాచారమైతే తెలుస్తుంది. త్రివిక్రమ్ ప్రస్తుతం జరుగుతున్న షూటింగులో కీలకమైన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారంట.

గుంటూరు కారం సినిమా నుండి ఇప్పటికే విడుదలైన మొదటిల్లుకు అలాగే టైటిల్ వీడియో సినిమాపై భారీగానే అంచనాలు పెంచాయి. ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన నాగ వంశీ ఆగస్టు 9న బర్త్ డే ట్రీట్ ఇస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. ఫాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ను రూపొందించే ఉద్దేశ్యంతో మేకర్స్ భారీ గా ఖర్చు చేయడంతో పాటు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.