Homeసినిమా వార్తలుGuntur Kaaram Story: త్రివిక్రమ్ మహేష్ మరో బ్లాక్ బాస్టర్!

Guntur Kaaram Story: త్రివిక్రమ్ మహేష్ మరో బ్లాక్ బాస్టర్!

Mahesh babu and Trivikram next Guntur Kaaram story, Guntur Kaaram Trailer release date, Guntur Kaaram leaked story, Sreeleela next movie, Guntur Kaaram USA Bookings

Guntur Kaaram Story and backdrop: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్ల భాగంగా విడుదలైన టీజర్ సాంగ్స్ సినిమాపై భారీగానే హైప్ తీసుకువచ్చాయి. ఇక మహేష్ మాస్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జనవరి 12న విడుదల కాబోతున్న గుంటూరు కారం సినిమా స్టోరీ విడుదలైన టీజర్ అలాగే సాంగ్స్ బట్టి ఈ రకంగా ఉన్నట్టు తెలుస్తుంది.

Guntur Kaaram Story: గుంటూరు కారం లీకైన ఫోటోను బట్టి సినిమా రాజకీయ నేపథ్యం స్పష్టంగా కనిపిస్తోంది. జనదళం పార్టీలో ప్రముఖ వ్యక్తి అయిన వైరా వెంకట స్వామి (Prakash Raj) తండ్రి వెంకటరమణారెడ్డి అనే పాత్రలో మహేష్ బాబు నటించారు. మహేష్ బాబు రాజకీయాల అభిమాని కానప్పటికీ, అతను తన తండ్రి 80వ పుట్టినరోజు తర్వాత ఊహించని విధంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడు.

రాజకీయ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత శత్రువులను, రాజకీయ సవాళ్లను హీరో ఎలా ఎదుర్కొంటాడు అనే దాని చుట్టూ గుంటూరు కారం కథ తిరుగుతుంది. దీనికి రుజువుగా ఈ సినిమా నుండి విడుదలైన మొదటి పాట దమ్ మసాలా సాంగ్ లో మహేష్ బాబు పార్టీకి సింబల్ గా ఉన్న కారులోంచి మనం దిగటం కూడా చూడవచ్చు. అలాగే మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను, దూకుడు సినిమాలను పోలి గుంటూరు కారం ఉండనున్నట్లు తెలుస్తోంది. Guntur Kaaram Story Leaked

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇదివరకే జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమాలో పొలిటికల్ టచ్ చేసిన విధానం మనం చూసిందే. అయితే ఇప్పుడు దాకా తీసిన త్రివిక్రమ్ సినిమాలలో పూర్తిగా పొలిటికల్ టచ్ బ్యాక్ డ్రాప్లో సినిమా రాలేదు ఇక మహేష్ బాబుతో రాబోతుంది సినిమా కంప్లీట్ గా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. Prakash Raj Role revealed in Guntur Kaaram Leaked

అంతేకాకుండా బ్యూటిఫుల్ శ్రీలీల ఇందులో యంగ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందట. పాలిటిక్స్‌ను కవర్ చేసే పనిలో రమణారెడ్డి ప్రేమలో పడిపోతుందట. అలా జర్నలిస్ట్‌తో రమణారెడ్డి లవ్ స్టోరీ ఘాటుగా ఉంటుందని తెలుస్తోంది. ఇక విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. గుంటూరు కారం సినిమా ట్రైలర్ ని ఈనెల 6న ప్రీ రిలీజ్ ఈవెంట్లో విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్.. అలాగే ఇవి ఈవెంట్ ని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం అయితే అందుతుంది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY