మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమాకి మొదటి దగ్గర నుంచి కష్టాలు తప్పడం లేదు. గుంటూరు కారం సినిమాలో ఇప్పటికే నటీనటులు అలాగే టెక్నీషియన్స్ కూడా చాలామంది మారడం జరిగింది. కొత్తగా డిఓపిని మార్చడంతో షూటింగ్ కి గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఈ గ్యాప్ లో మహేష్ బాబు వెకేషన్ కి వెళ్లడం జరిగింది .
త్రివిక్రమ్ అలాగే మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా మొదలుపెట్టిన దగ్గర్నుంచి సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా డిజిటల్ రైట్స్ 80 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ ఓటిటి సంస్థ కొనుగోలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా అన్ని పాజిటివ్ గా కలిసి వస్తున్న సినిమాకి మొదటినుంచి ఏదో ఒక సమస్య అయితే ఎదురవుతుంది.
మొదటిగా ఈ సినిమా నుండి హీరోయిన్ పూజ తప్పుకోవటం ఆ తర్వాత చేసిన షూటింగ్ ని మళ్ళీ తిరిగి చేయటం.. త్రివిక్రమ్ మళ్ళీ స్టోరీ మార్చడం.. రీసెంట్ గా సినిమాటోగ్రాఫర్ టీఎస్ వినోద్ ఈ సినిమా నుండి తప్పుకున్నారని వార్త వైరల్ అవుతుంది. స్థానంలో రవి కె చంద్రన్ పేరు కూడా వినిపించింది. దీనితో మహేష్ బాబు తన ఫ్యామిలీతో దుబాయ్ టూర్ వెళ్లడం జరిగింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరగటంతోఫ్రాన్స్ అసలు ఈ సినిమా బయటకు వస్తుందా అనే డౌట్ కూడా సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేయడం జరిగింది.
అయితే లేటెస్ట్గా మించిన సమాచారం మేరకు, ఫారిన్ టూర్ వెళ్ళిన మహేష్ బాబు ఇప్పుడు తిరిగి వస్తున్నారని.. అందుకనే త్రివిక్రమ్ మళ్ళీ గుంటూరు కారం సినిమా షూటింగ్ ని మొదలుపెట్టడానికి ప్లానింగ్ చేస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు, మహేష్ బాబు ఈ నెల ఈనెల 16న విదేశాల నుండి తిరిగి రానున్నారని తెలిసింది.

ఈ లోపల కొత్త సినిమాటోగ్రాఫర్ ని ఫైనల్ చేసి ఈనెల 12 నుంచి మహేష్ బాబు లేని ఎపిసోడ్స్ ని షూట్ చేయాలని.. ఆ తర్వాత 20వ తారీకు నుండి మహేష్ బాబు షూటింగ్ లో జాయిన్ అవుతారని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈనెల మహేష్ బాబు పుట్టినరోజు ఉండటంతో ఈ సినిమా నుండి మొదటి సాంగుని విడుదల చెయ్యటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అన్ని అనుకున్నట్టు ఈసారైనా జరుగుతాయో లేదో చూడాలి.