Nani30 Title: దసరా మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని (Nani) ప్రస్తుతం తన తదుపరి సినిమా అయినా Nani30 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు గోవాలో కీలకమైన షెడ్యూలు నడుస్తుంది. అయితే Nani30 title ఇదే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ హల్చల్ చేస్తుంది.
Nani30 title: కొత్త దర్శకులను అలాగే కథలను ఎప్పుడూ ఎంకరేజ్ చేసే నాని (Nani) ప్రస్తుతం Nani30 story కూడా ఒక చిన్నారి కథ అని తెలుస్తుంది. ఈ సినిమా దర్శకత్వం చేస్తున్న శౌర్య కూడా ఇదే మొదటి సినిమా కావటం అలాగే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా నా నీతో మొదటి సినిమా కావటం విశేషం. పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు విడిపోతే పిల్లలు పడే బాధ ఎలా ఉంటది అనే కదా సారాంశం తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారంట.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి నాని ఒక కొత్త టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం మేరకు “హాయ్..నాన్న” Nani30 title గా మూవీ టీం ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు. అయితే హీరో విక్రమ్ “నాన్న” అనే టైటిల్ తో సినిమాను చేసిన విషయం తెలిసిందే. రెండు సినిమాలు కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ జూనియర్ కావడం విశేషం.
అయితే ఈ టైటిల్ పై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాని తండ్రి పాత్రలో చేయడం ఇది రెండో సినిమా అవుతుంది. జెర్సీ సినిమాలో కూడా తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చూపించి అందరి చేత ప్రశంసలు పొందాడు నాని. ఇప్పుడు నాని 30 సినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. మరి కొన్ని రోజులు పోతే గాని ఈ సినిమా టైటిల్ మీద క్లారిటీ అనేది రాదు.