యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని, హామ్స్ టెక్ ఫిల్మ్స్ & సిల్లీ మాంక్స్ నిర్మించారు. త్వరలోనే విడుదలకు ముస్తాబవుతున్న హ్యాపీ ఎండింగ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్.
ఈ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. టైటిల్ కు భిన్నంగా హీరో యశ్ కూర్చుని ఉండగా.. వెనక గణపతి ఫోటో ఉంది. ఒక మునీశ్వరుడుతో పాటు పాటు విల్లును ఎక్కుపెట్టిన వ్యక్తి, విల్లు చేతబట్టి యుద్ధానికి వెళుతున్నాడా అనేలా మరో వ్యక్తి ఫోటోస్ కనిపిస్తుండగా.. పోస్టర్ లో ఏంటీ.. బాబా శాపం ఇచ్చాడా అనే ట్యాగ్ లైన్ ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాలకూ నచ్చేలా ఉంటూనే యువతరాన్ని టార్గెట్ చేసుకుని రూపొందిన చిత్రం ఇది.
సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి బజ్జి క్రియేట్ చేసిన మేకర్స్ ముందు ముందు రోజుల్లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు మొదలు పెడతారని తెలియజేశారు. ఈ సినిమాలో యూత్ ని అట్రాక్ట్ చేసే అంశాలు చాలా ఉన్నాయి అంటూ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాతలు చెప్పడం జరిగింది.