Hari Hara Veera mallu 2 parts: ప్రస్తుతం మొత్తం టాలీవుడ్ లో అయ్యో అని సింపతి చూపించే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాంబో ఎవరైనా ఉన్నారు అంటే అది గేయం మరియు క్రిష్ (Director Krish) అని యునానిమస్ గా చెప్పవచ్చు. పవర్ స్టార్ (Pawan Kalyan) తో ఏమని మూవీ స్టార్ట్ చేశారో కానీ ఇప్పటికీ ఆ సినిమా పూర్తయిన దాఖలా అయితే లేదు. మరోపక్క ఈ చిత్రానికి ఒప్పుకున్న పవన్ వకీల్ సాహెబ్ భీమ్లా నాయక్ చిత్రాలను పూర్తి చేయడంతో పాటు మరికొన్ని చిత్రాలను లైన్ లో పెట్టి సెట్స్ మీద చక చక షూటింగులు జరుపుతున్నారు.
Hari Hara Veera mallu 2 parts: ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓజీ (Pawan Kalyan OG) మూవీ కూడా సెట్స్ మీదకి వచ్చింది దాంతోపాటు మరో మూడు సినిమాలు కూడా ఒప్పుకొని ఉన్నారు. ఇంత జరిగినా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera mallu) మాత్రం ఎక్కడ మొదలుపెట్టారో అక్కడే ఆగిపోయి ఉంది. మంచి పిరియాడిక్ జోన్ లో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
Hari Hara Veera mallu సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి మార్పులు చేయడంతో పాటు పాటలు భారీ ఫైట్లు ఇలా టీం వర్క్ జోరుగా జరుగుతోంది అని వార్తలు వినిపించాయి. సెట్స్ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెటప్ కు సంబంధించిన స్టిల్స్ కూడా ఆన్లైన్ లో బాగా వైరల్ అయ్యాయి. ఇక మూవీ ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయం మాత్రం ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. ఓ రకంగా ఈ చిత్రం పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆసక్తి కనబరచడం లేదు అని టాక్ నడుస్తోంది.
ఎన్ని సినిమాలు పూర్తవుతున్నప్పుడు నిజంగా ఆసక్తి ఉంటే ఆ సినిమా ఏనాటికో కొలిక్కి వచ్చేది అని కొందరు విమర్శిస్తున్నారు కూడా. అయితే పవన్ మాత్రం ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాలు పూర్తి అయిన తర్వాత హరిహర వీరమల్లు (Hari Hara Veera mallu) పూర్తి చేయడం పక్కా అని అంటున్నాడట.. అంటే ఆ చిత్రం చూడాలి అంటే ఇంకో ఏడాది ఆగాల్సిందే. మరి అంతవరకు ఆగితే దర్శక నిర్మాతల పరిస్థితి ఏమిటి? నిర్మాతకు ఫండింగ్ కష్టాలు ఎంత ఎక్కువగా ఉంటాయో అందరికీ తెలిసిందే.
అయితే దీనిలో నుంచి బయటపడడానికి క్రిష్ (Krish) ఓ మధ్య మార్గాన్ని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాస్త మరో రెండు వారాలు షూటింగ్ చేయగలిగితే కథ ఓ కొలిక్కి వస్తుంది. దీన్ని పాటలు అనగా విడుదల చేసి తరువాత సంవత్సరం తర్వాత Hari Hara Veera mallu part 2 విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్నదానిపై ప్రస్తుతం క్రిష్ డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతవరకు పార్ట్ వన్ ఉంచవచ్చు ఏ సీన్లు జోడిస్తే రెండు భాగాలు కరెక్ట్ గా విభజించబడతాయి అన్న విషయంపై కుస్తీ పడుతున్నారట. పవన్ ఓకే చెప్తే మాత్రం హరిహర వీరమల్లు రెండు భాగాలలో విడుదలవుతుందని తెలుస్తోంది.