HHVM Latest Shooting Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు పొలిటికల్ గాను అలాగే సినిమాలు సమాంతరంగా న్యాయం చేస్తూ వస్తున్నారు. కాకపోతే అనుకున్న టైం కి షూటింగ్ కంప్లీట్ కావడం లేదు. దీంతో ప్రొడ్యూసర్లు అలాగే ఫ్యాన్స్ కూడా నిరుత్సాహ పడటం జరుగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అత్యంత భారీ బడ్జెట్ తో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరి హర వీరమల్లు ఇంకా షూటింగ్ స్టేజిలోనే ఉంది.
HHVM Latest Shooting Update: హరి హర వీరమల్లు సినిమాని మేకర్స్ పోయిన సంవత్సరమే విడుదల చేద్దామని ప్లాన్ చేశారు కాకపోతే అనుకోని కారణాల వల్ల అది పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది. అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరి హర వీరమల్లు షూటింగు ఇంకా 40% చేయాల్సి ఉంది అంట.
అలాగే ఈ 40% షూటింగ్ లోనే రెండు సాంగ్స్ కూడా చిత్రీకరణ చేయాల్సి ఉందంట. మే లేదా ఙూన్ నాటికి హరి హర వీరమల్లు షూటింగ్ ని పూర్తి చేసి దసరాకు విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సినిమా సోర్స్ చెప్పడం జరిగింది. అలాగే షూటింగ్ కంప్లీట్ అయ్యేవరకు ఇక ఎటువంటి అప్డేట్స్ ఇవ్వరని కూడా తెలుస్తుంది.
ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్ అలాగే హరీష్ శంకర్ మూవీ కూడా లైన్లో ఉన్నాయి. మరి పొలిటికల్ గా బిజీ అవుతున్న పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి విడుదలకు సిద్ధం చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.