పూర్వ కాలంలో అంటే బ్లాక్ అండ్ వైట్ సినీ కాలంలో… చారిత్రాత్మక సినిమాలు తీయడం పెద్ద కష్టమేమీ కాదు, ఎక్కువగా ఆర్ట్ ను ఉపయోగించి ఇటువంటి సినిమాలు తీసేవారు. ఇప్పట్లో చారిత్రాత్మక కథను తెరకెక్కించడం అంటే అంత సులభమేమీ కాదు…. బడ్జెట్ కూడా భారీగానే ఖర్చవుతుంది. కథలో ఏమాత్రం పట్టు విడిచినా అసలుకే మోసం వస్తుంది. విజువల్ గ్రాఫిక్స్ పనితనాన్ని కథను డైవర్ట్ చేయకుండా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపించినా ప్రేక్షకుల మెప్పును పొందడం సాధ్యం కాదు.
ఇటువంటి సినిమాలకు సంగీతం విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇలాంటి సవాళ్లను అధిగమిస్తూనే.. పవన్ కల్యాణ్ `హరి హర వీరమల్లు` చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో హిస్టారికల్ హీరో గా తొలిసారి మన ముందుకు రానున్నారు పవన్. ఇది ఒక గొప్ప బందిపోటు వీరోచిత గాథ.17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమాని రూపొందించేందుకు భారీ బడ్జెట్ ని వెచ్చిస్తున్నారని సమాచారం. ఇలా కథకు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని పూర్తిగా తెలుసుకొని మరీ ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు డైరెక్టర్ క్రిష్. అయితే ఈ కష్టానికి తగ్గ ఫలితం సినిమా థియేటర్ లో ప్రతి ప్రేక్షకుడిని పూర్తిగా సంతృప్తి పరుస్తుందని చెబుతున్నారు.
బాలకృష్ణతో గౌతమి పుత్ర శాతకర్ణి తెరకెక్కించిన క్రిష్ కథన బలం బావున్నా కానీ ఆరంభం ఉన్న గ్రిప్ ని చివరిలో ప్రదర్శించలేకపోయాడని క్లైమాక్స్ కి వచ్చేప్పటికి గ్రాప్ డౌన్ అయ్యిందని క్రిటిక్స్ విమర్శించారు. అయితే ఈసారి ఆ తప్పిదం రిపీట్ కాకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడని తెలిసింది. హండ్రెడ్ పర్సెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తి పరుస్తుందని విశ్వసిస్తున్నారు క్రిష్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కూడా సక్సెస్ అయ్యి ఈ సినిమాకు హైప్ పెంచింది. మరి హిస్టారికల్ హీరో గా మారిన పవర్ స్టార్ కు ఈ సినిమా తో ఎలాంటి ఆదరణ లభిస్తుంది అన్నది డైరెక్టర్ క్రిష్ పై ఆధారపడి ఉంది.
Click Here For Hari Hara Veera Mallu First Glimpse