పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలు వరుసగా షూటింగ్ జరుపుకుంటూ వెళ్తున్నారు.. వాటిలో ముందుగా సుజిత్ దర్శకత్వంలో వస్తున్న OG.. అలాగే హరీష్ శంకర్ రెండోసారి కలిసి చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల సంబంధించిన షూటింగు ఎక్కడ తగ్గకుండా శరవేగంగా జరుగుతున్నాయి. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న OG సినిమా రెండో షెడ్యూలు పూణేలో మొదలు పెట్టక ఇప్పుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి విడుదల చేయడం జరిగింది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి సోషల్ మీడియాలో.
పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లోనూ అలాగే రాజకీయాల్లోనూ తనదైన పాత్రను పోషిస్తున్నారు. ఏ టాలీవుడ్ హీరో చైన్ అంతా స్పీడ్ లో తన సినిమాలకు సంబంధించిన షూటింగు రెగ్యులర్గా చేస్తున్నారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూలు కొన్ని రోజుల క్రితమే పూర్తి చేసుకున్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా ఉస్తాద్ భగత్ సింగ్ రెండో షెడ్యూల్ ప్రారంభిస్తున్నట్టు లొకేషన్ సంబంధించిన కొన్ని ఫోటోలు ని షేర్ చేయడం జరిగింది. అయితే అందుతున్న సమాచారం మేరకు హరీష్ శంకర్ రెండో షూటింగ్ షెడ్యూల్ సంబంధించిన లొకేషన్ ని ఫైన్ లైఫ్ చేయగా షూటింగ్ మాత్రం మే రెండో వారం నుండి మొదలవుతుందని తెలుస్తుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూణేలో జరుగుతున్న OG సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ షూటింగు నాలుగు రోజులు జరుగుతుందని. ఇది పూర్తి కాగానే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో జాయిన్ అవుతారని సినిమా వర్గాల వారు చెప్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై మొదటి దగ్గరనుంచి ట్రోల్స్ మొదలయ్యాయి.
ఈ సినిమాని తమిళ్ లో సూపర్ హిట్ అయిన తేరీకి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు సోషల్ మీడియాలో ప్రచారం జరగగా.. హరీష్ శంకర్ ని బాగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం జరిగింది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ సినిమానా లేదంటే ఒరిజినల్ సినిమాల అనేది మరికొన్ని రోజులు పోతే గాని తెలుస్తుంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు..