PSPK28: బద్రి కాంబో రిపీట్‌ కానుందా ?

0
66
Harish Shankar promises vintage Pawan Kalyan for PSPK28

Pawan Kalyan PSPK28: ‘గబ్బర్‌సింగ్‌’తో సూపర్‌హిట్‌ కాంబోగా పేరు తెచ్చుకున్నారు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, డైనమిక్ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌. వీరిద్దరి కాంబోలో త్వరలో ఓ సరికొత్త చిత్రం పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలెన్నోబయటకు వచ్చాయి. ఈ సారి కేవలం వినోదం మాత్రమే కాదంటూ కాన్సెప్ట్ పోస్టర్‌ను వదిలిన క్షణం నుంచే అంచనాలు మొదలయ్యాయి.

PSPK28వ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ని యంగ్‌, పవర్‌ఫుల్‌ ఒకప్పటి ఎనర్జిటిక్‌ లుక్‌లో హరీశ్‌ చూపించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే హరీశ్‌ శంకర్‌ తాజాగా ‘బద్రి’ సినిమా నుంచి పవన్‌కల్యాణ్‌ పవర్‌ఫుల్‌ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ‘మరోసారి అదే ఎనర్జీని చూద్దాం’ అని హరీశ్‌ పేర్కొన్నారు.

కాగా, హరీశ్‌ శంకర్‌ షేర్‌ చేసిన వీడియోలో పవన్‌ నోటి నుంచి ఎక్కువగా నందా పేరు వినిపించింది. దీంతో నెటిజన్లు.. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నందాజీ అలియాస్‌ విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ నటించే అవకాశం ఉండొచ్చని అనుకుంటున్నారు. ఆయన పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. విలన్ గానా లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుగానా అనే విషయంలో స్పష్టత లేదు. కాని ఖచ్చితంగా పవన్ తో ప్రకాష్ రాజ్ చేయబోతున్న ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు.

ఇప్పుడు ఆ సెంటిమెంట్ హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ ల కాంబో సినిమాకు రిపీట్ అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు యూనిట్ సభ్యులు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఖచ్చితంగా ఈ సినిమా రాబడుతుందనే నమ్మకంను పవన్ కళ్యాణ్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.