వామ్మో అనిపించిన వాల్మీకి

0
226
Varun-Tej-Valmiki-Pre-Teaser-Talk-Harish-Shankar-Telugu-Movie-News
Varun-Tej-Valmiki-Pre-Teaser-Talk-Harish-Shankar-Telugu-Movie-News

వరుణ్ తేజ్…వస్తూనే తన లుక్స్ తోనే మెగా ప్రిన్స్ అనే ట్యాగ్ దక్కించుకున్నాడు.కానీ తన రూటే సెపరేటు అని మొదటి సినిమా ముకుంద తోనే ప్రూవ్ చేసాడు.కంచె లాంటి సినిమా కథని అర్ధం చేసుకుని,ఒప్పుకుని,లీనమై నటించడం అంటే మామూలు విషయం కాదు.అదీ రెండు సినిమాల అనుభవం ఉన్న వరుణ్ తేజ్ మాత్రం అపార అనుభవం ఉన్న నటుడిలా అలవోకగా నటించాడు.అంతే కాదు డైరెక్టర్ కి కావాల్సిన అవుట్ ఫుట్ ఇచ్చే డైరెక్టర్స్ హీరో అనిపించుకున్నాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

లోఫర్,మిస్టర్ లాంటి రొటీన్ అండ్ డిజాస్టర్ అటెంప్ట్స్ చేసినా మళ్ళీ త్వరగానే తేరుకున్నాడు.ఇక అక్కడినుండి తాను ఎంచుకున్న కథకి వెయిట్ ఉందా లేదా అనే విషయం తప్ప ఆ కథలో అతనికి ఎంత వెయిట్ ఉంది అనేది కూడా పట్టించుకోలేదు.అందుకే ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ వరుణ్ ఖాతాలో చేరింది.తనకు దక్కిన లిమిటెడ్ రోల్ తోనే సాయి పల్లవికి ధీటుగా నటించి తన ఉనికిని చాటుకున్నాడు.తొలిప్రేమ సినిమాలో తన నటనలో పొటెన్షియాలిటీ పూర్తిగా బయటపెట్టిన వరుణ్ తేజ్ ఆ సినిమాతో కూడా భారీ హిట్ అందుకున్నాడు.అలాంటి హిట్ తరువాత మళ్ళీ అంతరిక్షం అనే హాఫ్ బీట్ అండ్ టెక్నికల్ మూవీని ఒప్పుకున్న వరుణ్ తేజ్ గట్స్ ని మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు ,చాలామంది అప్రిషియేట్ చేశారు.అంతరిక్షం ప్లాప్ అయినా వరుణ్ తేజ్ ప్రయత్నానికి మాత్రం ఫుల్ అప్లాజ్ దక్కింది.వరుణ్ తేజ్ కి సెపరేట్ గా ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడడం మొదలయ్యింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఆ తరువాత వెంకీ లాంటి స్టార్ హీరో తో కలిసి ఏ మాత్రం బెరుకు లేకుండా కామెడి పండించాడు.తెలంగాణ యాసలో వరుణ్ తేజ్ అనర్గళంగా డైలాగ్స్ చెబుతుంటే అంతా ఆశ్చర్యపోయి చూశారు.F2 తరువాత ఇప్పడు మళ్ళీ వాల్మీకి అనే సినిమా చేస్తున్నాడు.కమర్షియల్ సినిమాలకు కరెక్ట్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు అంటేనే రిస్క్ అనుకున్నారు.ఇక ఆ సినిమాలో విలన్ పాత్ర అంటే చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాడు అనుకున్నారు.కానీ వాల్మీకి ఫస్ట్ లుక్ తోనే తక్కువ అంచనాలు వేసిన వాళ్ళ నోళ్లు లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చాడు.విలన్ గా వరుణ్ మేకోవర్ ఒక్కటి చాలు ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయిపోవడానికి అన్నట్టు ఉంది ఆ లుక్.

[INSERT_ELEMENTOR id=”3574″]

హీరో గా బ్లాక్ బస్టర్స్ అందుకున్న తరువాత కల్ట్ విలన్ గా కనిపించడం అంటే ఎంత గట్స్ కావాలి.ఆ గట్స్ వల్లే ఒక్క చిన్న ప్రీ టీజర్ తోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు వరుణ్ తేజ్.ముందు ముందు ఈ మెగా ప్రిన్స్ నుండి ఇంకెన్ని అసాధారణమయిన పాత్రలు వస్తాయో అనే క్యూరియాసిటీ కలిగించాడు ఈ రగ్గడ్ వాల్మీకి.ఆల్ ద బెస్ట్ వరుణ్ తేజ్ అలియాస్ వాల్మీకి.

Click Here For Valmiki Pre Teaser

 

[INSERT_ELEMENTOR id=”3574″]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here