Actor Sunil: హీరోగా ‘వేదాంతం రాఘవయ్య

0
535
Vedantham Raghavaiah_ Title Poster Of Sunil's Next Movie

హీరో క్యారెక్టర్లకు కాస్త గ్యాప్ ఇచ్చిన సునీల్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో సునీల్ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘వేదాంతం రాఘవయ్య’ అనే టైటిల్‌ను పెట్టారు. అంతేకాదు, ఈ సినిమాకు హరీష్ శంకర్ కథ అందించారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లోనే ‘గద్దలకొండ గణేష్’ వంటి హిట్ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు.

సునీల్ హీరోగా వచ్చిన ఆఖరి సినిమా ‘2 కంట్రీస్’. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తరవాత సునీల్ మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. ‘సిల్లీ ఫెలోస్’లో నరేష్ కలిసి నటించారు. ఆ తరవాత ‘అరవింద సమేత’, ‘అమర్ అక్బర్ ఆంటొని’, ‘చిత్రలహరి’, ‘అల వైకుంఠపురములో’ వంటి పెద్ద సినిమాల్లో నటించినా ఆయన పాత్రలకు పెద్దగా గుర్తింపు రాలేదు.

ఈ ఏడాది వచ్చిన ‘డిస్కోరాజా’ సినిమాతో సునీల్ విలన్ అవతారం ఎత్తారు. ప్రస్తుతం ఆయన నెగిటివ్ రోల్ పోషిస్తోన్న ‘కలర్ ఫొటో’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ‘వేదాంతం రాఘవయ్య’.. ఈ సినిమాకు ఇంకా దర్శకుడిని ఖరారు చేయలేదు. త్వరలోనే దర్శకుడి పేరుతో పాటు ఇతర వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

 

Previous articleVedantham Raghavaiah: Title Poster Of Sunil’s Next Movie
Next articleSS Rajamouli: ప్లాస్మా దానం అందుకే చేయలేదు