ప్రస్తుతం భారతదేశమంతా ఆదిపురుష్ ఫీవర్ నడుస్తుంది అని చెప్పవచ్చు. ఈరోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కావడంతో తిరుపతిలో ఎంతో ఘనంగా పెద్ద వేదికను సిద్ధం చేయడమే కాకుండా అట్టహాసంగా ఈవెంట్ నువ్వు చిత్ర యూనిట్ నిర్వహించనున్నారు. అయితే ఈ రోజును మరపురాని దినంగా మార్చడం కోసం ఎన్నో సంచలనాలను నమోదు చేయడానికి వీరు ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈరోజు ఈవెంట్లో రామాయణంతో సహా ఇతర హిందూ పురాణ గాధలను భారీ స్థాయిలో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రభాస్ రాముడి గెటప్ లో ఉన్న హాలోగ్రామ్ కటౌట్ ను 50 అడుగుల ఎత్తులో అత్యంత భారీగా కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రం తరఫున అయోధ్య రామాలయ నిర్మాణానికి కనివిని ఎరుగనంత భారీ విరాళాన్ని ఈరోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది.
అంతేకాకుండా రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటుకు హనుమంతుడు వస్తాడు అనేది ప్రజలందరి నమ్మకం .ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ఆదిపురుష్ మూవీ ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటుని హనుమంతుని కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుందట. అతి గొప్ప రామ భక్తుడైన హనుమంతుడికి కనీ విని ఎరగని రీతిలో…మొట్టమొదటిసారిగా ఇటువంటి గౌరవ సత్కారాన్ని ఆదిపురుష్ చిత్ర టీం అందించనున్నారు.
ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ హనుమంతుని సమక్షంలో ఆదిపురుష్ మూవీని అందరం తప్పక వీక్షిద్దాం అంటూ మేకర్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే భక్తిని అడ్డుపెట్టుకొని సినిమాకి ప్రమోషన్ స్టంట్ లు ఇవ్వడం ఈ మూవీ టీం నుంచి చూసి నేర్చుకోవచ్చు అని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. మూవీ విషయం ఎలా ఉంది అనేది తెలియదు కానీ ప్రస్తుతానికి రిలీజ్ అయిన పాటలు మరియు ట్రైలర్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

.ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో ఈరోజు ఈ మూవీ నుంచి రెండవ ట్రైలర్ కూడా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం నుంచి విడుదలైన రామ్ రామ్ రాజారాం పాట మాత్రం మంచి భక్తి మొట్టో తో ఆకట్టుకుంటుంది. జూన్ 16న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం గ్రాండ్ లెవెల్ సక్సెస్ సాధిస్తుంది అని ఆశిద్దాం.