‘ఆదిపురుష్‌’ లో ప్రభాస్ తల్లిగా హేమమాలిని

0
241
hema-malini-playing-mother-character-in-prabhas-movie
hema-malini-playing-mother-character-in-prabhas-movie

రామాయణం నేపథ్యంలో ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ రూపొందిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఇందులో రాముడి పాత్రలో అలరించబోతున్నాడు ప్రభాస్. ఇప్పటికే లంకాధిపతి రావణాసురుని పాత్రకు సైఫ్‌ ఆలీ ఖాన్ ను ఎంపిక చేశారు. ప్యాన్ ఇండియా ఫిల్మ్ గా పలు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు పలువురి పేర్లు వినిపించినా ఇప్పటి వరకూ ఎవరినీ ఫైనలైజ్ చేయలేదు.

 

 

అయితే తాజాగా శ్రీరాముని తల్లి కౌసల్య పాత్ర కోసం హేమమాలినిని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల గౌతమీపుత్రశాతకర్ణిలో శాతకర్ణి తల్లి గౌతమిగా నటించి ఆ పాత్రకు వన్నె తెచ్చిన హేమమాలిని అయితే కౌసల్య పాత్రకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతో ఆమెను అప్రోచ్ అయ్యాడట ఓం రౌత్. హేమమాలిని కూడా అందుకు ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి ఈ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూద్దాం.