కొత్త వ్యాపారం మొదలు పెట్టిన స‌మంత

0
26
Here is the Samantha Akkineni New business details

Samantha: నాగార్జున ఇంటికి కోడలిగా వెళ్లిన సమంత సినిమాలు చేస్తే సరిపోతుందిలే అనుకోవడం లేదు. ఆమె ఇప్పటికే సాకి అనే దుస్తుల వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.  కొత్తగా ఆమె మరో వ్యాపారం మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట. సాకి మంచి సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో అనుబంధంగా జ్యూవెలరీ బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. దీనికి సంబంధించిన ప్రణాళిక పూర్తికాగా త్వరలో అధికారిక ప్రకటన ఉంటుంది అంటున్నారు.

హీరోయిన్స్‌లో ఇప్ప‌టికే త‌మ‌న్నా జ్యువెల‌రి బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు సామ్ కూడా ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే స‌మంత గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న శాకుంత‌లం సినిమాలో న‌టిస్తోంది. అలాగే రీసెంట్‌గా వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మేన్ సీజ‌న్‌2లో స‌మంత పోషించిన రాజీ అనే త‌మిళ టెర్ర‌రిస్ట్ పాత్ర‌కు మంచి గుర్తింపు ద‌క్కింది.