తెలుగు ప్రేక్షకులు ప్రతిభగల యువ నటులను ప్రేమించి, వారిని స్టార్ స్థాయికి తీసుకువెళ్తారు. పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటే చాలు, వారికి తమ పూర్తి ఆదరణను అందిస్తారు. ఈ కోవలో తన తొలి చిత్రం “డ్రింకర్ సాయి”తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న యువ హీరో ధర్మ, ఇప్పుడు టాలీవుడ్‌లో మరో ప్రామిసింగ్ యంగ్ టాలెంట్‌గా గుర్తింపు పొందుతున్నారు.
ఈ నెల 27న థియేటర్స్‌లో విడుదలైన “డ్రింకర్ సాయి” సినిమా యూత్‌ను మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకొని మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో ధర్మ తన డ్యాన్స్‌లు, ఫైట్స్, మరియు అద్భుతమైన నటనతో అందరినీ ఆకర్షించాడు. సాయి పాత్రలో అతని ప్రదర్శన అందరి మనసును దోచుకుంది. టీజింగ్ సీన్స్‌లో చిలిపి భావాలు, ఫన్ సీన్స్‌లో ఎనర్జీ, ఎమోషనల్ సీన్స్‌లో మెచ్యూరిటీతో పర్‌ఫార్మెన్స్ అందించాడు.
“డ్రింకర్ సాయి” విడుదలైన వెంటనే, ధర్మ టాలెంట్‌ను కొనియాడుతూ, ఇండస్ట్రీలో మరో భరోసా ఇచ్చే యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ధర్మ కెరీర్‌కు స్ట్రాంగ్ ఫస్ట్ స్టెప్‌గా నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ధర్మ వంటి ప్రతిభావంతులుగా టాలెంట్ shine చేయడం ఆనందకరం