hero dr rajasekhar health update from city neuro centre

Dr. Rajasekhar Health update:  ఇటీవలే హీరో రాజశేఖర్ కుటుంబానికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివాని, భార్య జీవిత కరోనా బారిన పడ్డామని రాజశేఖర్ స్వయంగా పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే జీవిత, వాళ్ళ ఇద్దరు కూతుళ్లు కరోనా నుంచి కోలుకున్నారు. రాజ‌శేఖ‌ర్ దంప‌తులకి సంబంధించి తాజాగా హెల్త్ బులిటెన్ విడుద‌లైంది.

ప్రస్తుతం ఐసీయూలో నాన్‌ ఇన్‌వాసివ్‌ వెంటిలేటర్‌పై రాజశేఖర్‌కి చికిత్స అందిస్తున్నామని, ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని, డాక్టర్స్ సూచనలకు ఆయన స్పందిస్తున్నారని తాజా బులెటిన్‌లో వైద్యులు వెల్లడించారు. అలాగే కరోనా నుంచి కోలుకున్న జీవితను ఈ రోజు డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. శివాత్మిక రెండు రోజుల క్రితం త‌న తండ్రి క‌ష్టంగా క‌రోనాతో పోరాడుతున్న‌ట్టు పేర్కొంది. అభిమానులు, ప్ర‌ముఖుల రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు.