ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న కార్తికేయ!

0
75
Hero Karthikeya Gets Engaged Secretly

Hero Karthikeya got engaged: ‘ఆర్‌ఎక్స్‌ 100’తో టాలీవుడ్‌ హీరోగా పరిచయమై… తర్వాత వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ రాణిస్తున్న కార్తికేయ గుమ్మకొండ ఓ ఇంటివాడుకాబోతున్నాడు. ఇటీవల సమీప బంధువులు, మిత్రుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం అయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో కార్తికేయ నిశ్చితార్థం జ‌ర‌గ‌గా, ఈ వేడుక‌కు కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యార‌ట‌. ప‌లువురు సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అయితే కార్తికేయ చేసుకోబోయే అమ్మాయికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఇక కార్తికేయ సినిమాల సంగతి చూస్తే… ఇటీవల ‘చావు కబురు చల్లగా’ సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చి మెప్పించాడు. ప్రస్తుతం అజిత్‌ ‘వాలిమై’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా ‘రాజా విక్రమార్క’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు.