Homeసినిమా వార్తలుహీరో నాగచైతన్య చేతుల మీదుగా ప్రారంభమైన సాయి రత్న క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2

హీరో నాగచైతన్య చేతుల మీదుగా ప్రారంభమైన సాయి రత్న క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2

బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తేజ్ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మ దేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారద్యంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన హీరో నాగ చైతన్య  హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు .స్క్రిప్ట్ ఏ. సి .యస్ కిరణ్ అందించారు దర్శకుడు సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో

చిత్ర దర్శక,నిర్మాత బొమ్మ దేవర రామచంద్ర రావు మాట్లాడుతూ.. మేము పిలవగానే వచ్చిన హీరో నాగ చైతన్య కు, సి కళ్యాణ్, సముద్ర గార్లకు, మరియు నాకు ఈ సినిమా చేసే అవకాశం కల్పించిన నాగార్జున గారికి ధన్యవాదములు. నాకు మంచి యూనిక్ ఉన్న సబ్జెక్టు లభించడంతో ఈ సినిమా చేస్తున్నాను.

Hero Naga Chaitanya Attends The Launching of Sai Ratna Creations Production No 2 photos (2)
Hero Naga Chaitanya Attends The Launching of Sai Ratna Creations Production No 2 photos (2)

ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ఈ కథ ఉంటుంది. ఈ చిత్రం ద్వారా హీరో గా పరిచయమవుతున్న మా అబ్బాయిని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 10 నుండి 21వ తేదీ వరకు మొదటి షెడ్యూల్ చేసుకుని జులై ఫస్ట్ నుండి అరకు లో మిగిలిన షూటింగ్ జరుపుకుని సెప్టెంబర్ లో షూటింగ్ పూర్తి చేసుకొని అదే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. ఇందులో రాజు సుందరం అద్భుతమైన స్టెప్స్ అందిస్తున్నాడు. మంచి ఆర్టిస్టులు టెక్నిషియన్స్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఏంటర్ టైన్ చేస్తుంది అన్నారు.

Hero Naga Chaitanya Attends The Launching of Sai Ratna Creations Production No 2 photos (1)
Hero Naga Chaitanya Attends The Launching of Sai Ratna Creations Production No 2 photos (1)

చిత్ర హీరో తేజ్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి సినిమా అంటే ప్యాషన్, మా నాన్న గారు నన్ను ఫోర్స్ చేయలేదు. నీకు ఏది ఇష్టమో అది చేయమన్నారు. నాకు నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాకు కావాల్సిన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్ని నేర్చుకొని నా ఇంట్రెస్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు భిన్నమైన చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. నేను చేస్తున్న ఈ మొదటి చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన రవి కె. మాట్లాడుతూ.. ఇది మంచి యూనిక్ సబ్జెక్టు.ఈ కథ మీద నేను గత ఆరు నెలలుగా జర్నీ చేస్తున్నాను.ఈ సినిమా కొరకు హీరో ప్రత్యేకంగా తనకు తాను మౌల్డ్ చేసుకున్నాడు.

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY