టాలీవుడ్లో మళ్లీ డ్రగ్ కేస్ తెరపైకి వచ్చింది ముందు టాప్ సెలబ్రిటీసులో ఉండగా ఇప్పుడు ఏపీ చౌదరి అరెస్ట్ అయిన తర్వాత ఏ లిస్టులో తెలుగు హీరోయిన్స్ అలాగే సెలబ్రిటీస్ ఉన్నట్టు తెలుస్తుంది. వీటిలో ముఖ్యంగా బయటపడిన పేర్లను సురేఖవాణి అలాగే అషురెడ్డి. ఇది ఇలా ఉండగా రీసెంట్గా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఈ డ్రగ్ కేసు పై సంచలమైన కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక విషయానికి వస్తే, వరుస సినిమాలతో బిజీగా ఉన్న నిఖిల్ ప్రస్తుతం స్పై అనే సినిమా ప్రమోషన్ లో ఉన్నారు. ఈ సినిమా జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. శనివారం రోజు హైదరాబాదులో పోలీసులు ఏర్పాటుచేసిన ‘పరివర్తన’ అని సభకి నిఖిల్ సిద్ధార్థ హాజరు అవ్వటం జరిగింది. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ తన కొత్తగా సినిమాల్లోకి వచ్చిన టైంలో నన్ను కూడా డ్రగ్స్ తీసుకోమన్నారని కామెంట్ చేయడం ఎప్పుడు వైరల్ గా మారాయి.
ఈ సభలో నిఖిల్ మాట్లాడుతూ ” తాను కొత్తగా సినిమాల్లోకి వచ్చిన రోజుల్లో చాలామంది నన్ను డ్రగ్స్ తీసుకోమని ఎంకరేజ్ చేయడం జరిగిందని.. కానీ వాటన్నిటికీ నేను దూరంగా ఉండటం చెప్పటం వల్ల ఇప్పుడు సంతోషంగా ఉన్నానంటూ కామెంట్ చేశారు” అలాగే తన మాట్లాడుతూ.. యూత్ కూడా ఇలాంటి వ్యసనాలకి దూరంగా ఉండటం చాలా మంచిది అంటూ ‘సే నో టు డ్రగ్స్’ అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే, నిఖిల్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీస్ ని ఫాన్స్ కి అలాగే ప్రజలకు అందిస్తున్నారు. ప్రతి సినిమా స్టోరీ విషయంలో వేరియేషన్స్ చూపిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాల తర్వాత నిఖిల్ స్పై అనే యాక్షన్ డ్రామాతో మన ముందుకు ఈనెల 29న రాబోతున్నారు.