పెళ్ళైన నాలుగు నెలలకే కూతురికి పేరు పెట్టేసిన నిఖిల్..!

0
357
hero nikhil siddharth says his daughter name and openup in latest program

Nikhil Siddharth Daughter name: తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొన్న నిఖిల్ కొన్ని సీక్రెట్ వెల్లడిస్తూ ఓపెన్ అయ్యాడు. తన పెళ్ళికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు చెప్పి ఆకర్షించాడు.

ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వివాహం ప్రియసఖి పల్లవి వర్మతో జరిగిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వీరి పెళ్లి కుటుంబ సభ్యులు.. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. పెళ్లయ్యాక తండ్రి కావడం అనేది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి కావాల్సిందే కదా. కాబట్టి ఆ నిజాన్ని ముందే చెప్పి తమకు పుట్టబోయే బిడ్డ పేరును కూడా బయటపెట్టేశాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్.

తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొన్న నిఖిల్‌ చాలా విషయాలు ఓపెన్‌గా మాట్లాడాడు. కాదు కాదు అలీ మాట్లాడించాడు. తాజాగా ఈ షో ప్రోమో వీడియోలో నిఖిల్ చెప్పిన సంగతులు ఆసక్తి కలిగిస్తున్నాయి. ‘మీ పాప పేరు మాయ అంట కదా.. నీకు మొన్ననే పెళ్లైంది. ఇంతలోనే పాప ఏంటి’ అని అలీ అడుగగా.. నిఖిల్ సమాధానమిస్తూ ”పల్లవిని మీట్ అయిన కొన్ని రోజులకే నా కూతురు పేరు ‘మాయ’ అని అనుకుంటున్నాను. ఆమె కూడా నీ ఇష్టం అని చెప్పిందని చెప్పాడు. మరి కొడుకు పుడితే ‘మాయలోడు’ అని పెడతావా? అంటూ దీనిపై మరో కౌంటర్ వేశాడు అలీ.

అలాగే తనకు పవన్ కళ్యాణ్, రవితేజ స్టైల్ అంటే ఇష్టమని చెప్పిన నిఖిల్.. ఆ హీరోలనే ఎక్కువగా ఫాలో అవుతుంటానని చెప్పారు… హీరోగా కావడం కోసమే ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యానని చెప్పిన నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ సినిమా అప్పుడు ఆఖరికి సూట్ కేసులు కూడా మోశానని చెప్పాడు. ఇదిలావుండగా ‘అర్జున్ సురవరం’ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న నిఖిల్ ప్రస్తుతం ‘కార్తికేయ’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘కార్తికేయ 2’ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు ‘కుమారి 21F’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ’18 పేజెస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.