మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ‘క్రాక్’. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత ఠాగూర్ మధు భావిస్తున్నాడు. అయితే అనుకోని విధంగా ఇప్పుడు ఈ సినిమా ఓ తమిళ డిస్ట్రిబ్యూషన్ కోర్టుకు వెళ్లటంతో లీగల్ చిక్కుల్లో ఇరుక్కుంది. ఈ సినిమా రిలీజ్ అపేలా స్టే ఇవ్వాలని ఆ డిస్ట్రిబ్యూటర్ కోరినట్లు సమాచారం.
అసలు విషయం ఏమిటంటే ‘క్రాక్’ చిత్ర నిర్మాత అయిన ఠాగూర్ మధు తమిళ్ లో విశాల్ హీరోగా టెంపర్ సినిమాను రీమేక్ చేశాడు. ఆ సినిమా పేరు ‘అయోగ్య’. తమిళ్ లో డిజాస్టర్ గా నిలిచింది. స్క్రీన్ సీన్ మీడియా వారు ‘అయోగ్య’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఠాకూర్ మధు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడంలేదని, తమ బాకీలు తీర్చిన తర్వాతే ఆయన నిర్మిస్తున్న ‘క్రాక్’ సినిమాను విడుదల చేయాలని స్క్రీన్ సీన్ మీడియా వారు కోర్టును ఆశ్రయించారు. దాంతో ఇప్పుడు బాల్ కోర్ట్ లో ఉంది. కోర్ట్ స్టే ఇస్తుందా లేదా చూడాలి.
మరో ప్రక్క థియోటర్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ మొత్తం జీటీవి గ్రూప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి చర్చలు జరిపింది. నిర్మాతలతో దాదాపు డీల్ పైనల్ అయ్యిందనుకున్న టైమ్ లో జీ టీవి వారు వెనక్కి తగ్గినట్లు సమాచార. అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజకు ‘క్రాక్’ సినిమా చాలా ముఖ్యమైనది. దానిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరో ప్రక్క ‘క్రాక్’ చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ఈ రోజు నిర్మాతలు ప్రకటించారు. మరి ఈ కోర్టు గొడవ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.