hero sai dharam tej shocking comments on his marriage

Sai Dharam Tej Marriage: టాలీవుడ్‌లో ఇటీవల కొందరు హీరోలు పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి ప్రవేశించినా.. ఇంకా కొందరు హీరోలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లుగా చెలామణి అవుతున్నారు. అలాంటి వారిలో మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ ఒకరు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి ఓ ఇంటివాడు అవ్వాలని డిసైడ్ అయ్యాడని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు.

ఇటీవల ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పిన మేనమామ చిరంజీవి.. ‘సోలో లైఫ్ ఇంకొన్ని రోజులే.. ఎంజాయ్ చేయ్’ అంటూ సెటైర్ వేశారు. దీంతో తేజ్ తర్వలోనే పెళ్లి పీటలెక్కడం ఖాయమన్న అభిప్రాయానికి ఫ్యాన్స్ వచ్చేశారు. అయితే తేజ్ దీనిపై స్పందిస్తూ తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. అయితే పెళ్లిపై తనకు ఆసక్తి లేదని తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి చేసేయాలని నిర్ణయానికి వచ్చేశారు. వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక సంబంధాలు చూడమని చెప్పా. అంతకుమించి పెళ్లిపై నాకెలాంటి ఇంట్రస్ట్ లేదు. ఒకవేళ అమ్మాయి నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా’ అంటూ క్లారిటీ ఇచ్చాడు తేజ్.

సినిమాల విషయానికొస్తే సాయి తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. ‘ప్రస్థానం’ దేవా కట్ట దర్శకత్వంలో ఓ సినిమాని స్టార్ట్ చేసిన తేజ్.. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించనున్నాడు.