ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన శర్వానంద్..!

1455
Hero Sharwanand Ready To Start New Journey With His Girl Friend

కరోనా సమయంలో కూడా చాలా మంది సినిమా సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే.. టాలీవుడ్ లో యంగ్ హీరోలు అయిన నిఖిల్, నితిన్, రానా ఓ ఇంటివాళ్ళు అయ్యారు. ఇప్పుడు మరో హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నాడని తెలుస్తోంది. ఇంతకి ఈ హీరో ఎవరో కాదు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో శ‌ర్వానంద్..

గత 16 ఏళ్లుగా సినీ కెరీర్ కొనసాగిస్తూ వరుస సినిమాలు చేస్తున్న శర్వానంద్ వయస్సు ప్రస్తుతం 36 సంవత్సరాలు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సలహా మేరకు శర్వానంద్ పెళ్లికి రెడీ అయ్యారని తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. శర్వా చేసుకోబోయేది తన చిన్ననాటి స్నేహితురాలినే. గత కొన్నేళ్లుగా ఆమెతో ప్రేమలో ఉన్న శార్వానంద్.. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దల వద్దకు తీసుకెళ్లి అందరి అంగీకారం పొందారట. ఇలా మొత్తం లైన్ క్లియర్ చేసుకున్న ఆయన ఇక పెళ్లికి ముహూర్తం వెతికే పనిలో ఉన్నారని సమాచారం.

ఇక శర్వానంద్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది జాను సినిమాతో ఆకట్టుకున్న శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం’ అనే మూవీలో నటిస్తున్నాడు.. ఇక ఈ సినిమాతో పాటుగా అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం, కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమాని చేస్తున్నాడు.. వచ్చే ఏడాది సినిమాలు విడుదలు కానున్నాయి..