అఖండ ఒక హై ఓల్టేజ్ సినిమా – శ్రీకాంత్

0
1539
Hero Srikanth about Balakrishna Akhanda movie story

Hero Srikanth about Balakrishna Akhanda movie story – Akhanda movie songs – Akhanda Trailer Date

నందమూరి బాలకృష్ణ (Balakrishna), స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ (Akhanda) ప్రమోషన్స్‌లో భాగంగా హీరో శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేశాను. సక్సెస్ అయ్యాను. హీరోగా చేశాను. మధ్యలో మళ్లీ విలన్‌గా చేశాను. యుద్దం శరణం అనే సినిమాలో విలన్‌గా చేశాను. మీరు ఏది పడితే అది చేయకండని దాని కంటే ముందే బోయపాటి గారు అన్నారు. సరైనోడు సినిమాలో మంచి సాఫ్ట్ కారెక్టర్ ఇచ్చారు. మంచి విలన్ పాత్రను రాస్తాను వేస్తారా? అని అడిగారు. నేను అక్కడి నుంచే వచ్చాను.. ఎందుకు చేయను భయ్యా అని అన్నాను.

అలా ఓ సారి బాలయ్య బాబు (Balakrishna) అఖండ కోసం విలన్ కారెక్టర్ చెప్పారు. విన్న వెంటనే భయపడ్డాను. వరదరాజులు కారెక్టర్‌కు న్యాయం చేయగలనా? అని అనుకున్నాను. ఎందుకంటే బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్ అంటే మామూలుగా ఉండదు. నా గెటప్ చూసి అందరూ ఫోన్లు చేశారు. ప్రశసించారు. కానీ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాను. కొత్త శ్రీకాంత్ (Srikanth) కనిపిస్తాడు.

Hero Srikanth about Balakrishna Akhanda movie story
Hero Srikanth about Balakrishna Akhanda movie story

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియెన్స్‌లో అంచనాలుంటాయి. ముఖ్యంగా ఇందులో డైలాగ్స్ అద్బుతంగా ఉంటాయి. బాలయ్య గారి దగ్గరి నుంచి ప్రేక్షకులు కోరుకునేదే అది. ఇందులో సెంటిమెంట్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది. పునీత్ రాజ్ కుమార్‌తో ఓ సినిమాలో విలన్‌గా నటించాను. శంకర్ రామ్ చరణ్ సినిమాలో ఓ పాత్రను చేస్తున్నాను. వివరాలు ఇప్పుడే చెప్పొద్దని అన్నారు.

 

Previous articleRRRలోని భావోద్వేగాలకు జనని పాట నిదర్శనం: రాజమౌళి
Next articleAvika Gor Latest Photo Shoot