Hero Sundeep Kishan Ventures Into A New Business Segment in amaravathi
Hero Sundeep Kishan Ventures Into A New Business Segment in amaravathi

హీరో సందీప్ కిషన్.. కెరీర్ లో ఒక్కో హిట్టు.. ఒక్కో హిట్టు.. సాధిస్తూ ముందుకు వెళుతున్నాడు. నిను వీడని నీడను నేనే.. సినిమా హిట్టు కొట్టడం సందీప్ కెరీర్ కు ప్లస్ అయింది. ఆ తర్వాత తెనాలి రామ కృష్ణుడు యావరేజ్ గా నిలిచింది. సందీప్ సినిమాల విషయంలోనే కాదు.. వ్యాపార పరంగా కూడా మాంచి స్వింగ్ లో ఉన్నాడు. హైదరాబాద్ లో వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్లను నడుపుతున్నాడు.. ఫుడ్ బాగుండడంతో హోటల్ బిజినెస్ బాగా సాగుతోంది. ఇప్పటిదాకా హైదరాబాద్ కే తన బిజినెస్ లను పరిమితం చేసిన సందీప్ కిషన్.. తన వ్యాపారాన్ని ఏపీ రాజధాని అమరావతికి మార్చాడు. ముఖ్యంగా ఓ సెలూన్ ప్రారంభించేందుకు సందీప్ కిషన్ ఏర్పాట్లు మొదలుపెట్టాడు. క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ తీసుకోగా.. అతి త్వరలోనే ఈ సెలూన్ ప్రారంభంకానుంది.

ఉదయ్ కిరణ్ బయోపిక్ ను రూపొందించాలని చాలా మంది ప్రయత్నించారు. గతంలో ఇందుకు సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి. మరోసారి ఉదయ్ కిరణ్ బయోపిక్ టాపిక్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ క్యారెక్టర్ కోసం సందీప్ కిషన్ ను అడిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనిపై సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చారు. ఉదయ్ కిరణ్ బయోపిక్ లో తాను చేస్తున్నట్టుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోందని.. ఈ ప్రాజెక్టును గురించి ఇంతవరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు. ఈ వార్తలో నిజం లేదనీ.. బయోపిక్ లు చేయాలన్న ఉద్దేశం కూడా తనకు లేదని సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు. సందీప్ ప్రస్తుతం ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాలో నటిస్తున్నాడు. హాకీ నేపథ్యంలో సాగబోయే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.