హీరో మూవీ రివ్యూ: సంక్రాంతి ఎంటర్టైనర్

0
2485
Hero Telugu Movie Review Rating
Hero Telugu Movie Review Rating

Hero Telugu Movie Review Rating

రేటింగ్ 3/5
నటీనటులు అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య
దర్శకత్వం శ్రీరామ్ ఆదిత్య టి
నిర్మాత పద్మావతి గల్లా
సంగీత దర్శకుడు జిబ్రాన్

 

మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ కథానాయకుడిగా పరిచయమైన సినిమా ‘హీరో’. ఈ రోజు విడుదలైంది. ఇంతకీ గల్లా అశోక్‌ ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్‌ అయ్యారా..? హీరో ఎలా ఉంది? సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :
అర్జున్ (అశోక్ గ‌ల్లా) హీరో అవ్వాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. త‌మ అపార్ట్‌మెంట్‌లో కొత్త‌గా వ‌చ్చిన సుబ్బు అలియాస్ సుభ‌ద్ర (నిధి అగ‌ర్వాల్‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ముంబై నుంచి హైద‌రాబాద్ వచ్చిన సుబ్బు తండ్రి (జ‌గ‌ప‌తి బాబు)… హీరోగా ట్రై చేస్తున్న అర్జున్‌కు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు.

ఆయన్ను కన్వీన్స్ చేయాలని అనుకుంటున్న అర్జున్‌కు… తనకు కాబోయే మామను చంప‌డానికి ముంబై మాఫియా నుంచి హైదరాబాద్ రౌడీలకు సుపారీ అందిందని తెలుస్తుంది. సుబ్బు తండ్రిని చంపాల‌నుకున్న‌ది ఎవ‌రు? ఆయన్ను అర్జున్ ఎలా కాపాడాడు? సుబ్బు తండ్రి ముంబైలో ఏం చేశాడు? ముంబై పోలీసుల‌కు మోస్ట్ వాంటెడ్ డాన్ అయిన స‌లీం భాయ్ (ర‌వికిష‌న్) గన్ అశోక్ చేతికి ఎలా వచ్చింది? చివరకు, ఏమైంది? అనేది మిగతా సినిమా.

Hero Review rating in Telugu
Hero Review rating in Telugu

నటీనటులు:
అశోక్ గల్లా తన పాత్రకి తగ్గట్టుగా కావాల్సిన అన్ని కీలక సన్నివేశాల్లో తగు ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ లు మరియు డాన్స్ విషయాల్లో అశోక్ సూపర్బ్ డెబ్యూ ని ఇచ్చాడు. నిధి అగర్వాల్ కూడా ఆడియెన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. అలానే అశోక్ తో కొన్ని సీన్స్ లో మంచి కెమిస్ట్రీ కనబరిచింది.

నటుడు జగపతి బాబు కూడా మంచి పాత్రలో కనిపించారు. ఇంకా నటుడు బ్రహ్మాజీ, అలానే సత్యా మరియు ‘వెన్నెల’ కిషోర్ ల ఎంటర్టైనింగ్ ట్రాక్స్ ఆడియెన్స్ కి నవ్వులు పూయిస్తాయి. అలాగే కంపోజర్ జిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ఈ సినిమాకి నిర్మాణ విలువలు మంచి హైలైట్ అని చెప్పొచ్చు.

ప్ల‌స్ పాయింట్స్
క‌థ‌నం, క‌థా నేప‌థ్యం
ఫస్ట్ హాఫ్
కామిడి

మైన‌స్ పాయింట్స్
సెకండ్ హాఫ్
లాజిక్ లెస్ గా కొన్ని సీన్లు

Hero Review rating in Telugu
Hero Review rating in Telugu

విశ్లేషణ:
గల్లా అశోక్‌ న్యూ కమర్‌ అయినా ఎక్కడా బెరుకు లేకుండా యాక్ట్ చేశారు. కెమెరా ఫ్రెండ్లీగా ఉన్నాయి అతని ఎక్స్ ప్రెషన్స్. డ్యాన్సులు కూడా బావున్నాయి. నిధి అగర్వాల్‌ తన కేరక్టర్‌కి తగ్గట్టు కనిపించారు. కామెడీ, కమర్షియల్ సాంగ్స్, మాంచి ఫైట్స్… సినిమాను స్ట‌యిలిష్‌గా తీశారు. కృష్ణ, మహేష్ బాబు అభిమానులకు సినిమాలో అభిమాన హీరో రిఫరెన్స్‌లు న‌చ్చుతాయి.

జిబ్రన్‌ సంగీతం బావుంది. పాటలకన్నా రీరికార్డింగ్‌ సన్నివేశాలకు తగ్గట్టు ఉంది. సూపర్‌స్టార్‌ కృష్ణ కౌబోయ్‌ గెటప్‌ని స్క్రీన్‌ మీద చూపించినప్పుడు ఘట్టమనేని అభిమానుల జోష్‌కి అంతే లేదు. అలాగే రెట్రో సాంగ్‌లో సూపర్‌స్టార్‌ విజువల్స్ ని మిక్స్ చేసిన తీరు బావుంది.

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య వర్క్ కి వస్తే ఈ సినిమాకి మంచి వర్క్ ఇచ్చాడని చెప్పాలి. తాను తీసుకున్న సబ్జెక్ట్ దానిలో ఫన్ కలిపి ఆల్ మోస్ట్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా తన స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా ఉంది. యంగ్ హీరో అశోక్ కి మంచి డెబ్యూ తన డైరెక్షన్ తో ఇచ్చాడని చెప్పాలి.

కామెడీ సినిమాలు ఎంజాయ్ చేసే ప్రేక్షకులు హ్యాపీగా సినిమాకు వెళ్ళవచ్చు. హీరోగా అశోక్ గల్లా తొలి సినిమాతో మంచి మార్కులు వేయించుకుంటాడు. కొన్ని లాజికల్ ఎర్రర్స్ ని పక్కన పెడితే ఈ పండుగకి ‘హీరో’ బాగానే ఎంటర్టైన్ చేస్తాడు.

REVIEW OVERVIEW
CB DESK
Previous articleBangarraju 1st Day Total WW Collections
Next articleBheemla Nayak Sankranti Poster Released