కంగనాపై విశాల్ సెన్సేషనల్ కామెంట్స్..!

0
296
hero vishal sensational comments on kangana ranaut fights against government

Kangana Ranaut: Vishal: ముంబై ప్రభుత్వంపై హీరోయిన్ కంగనా రనౌత్ చేస్తున్న పోరాటానికి సపోర్ట్ పలికారు హీరో విశాల్. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ లేఖ పోస్ట్ చేసాయడంతో అది వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత అక్కడ పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ నెపోటిజం పై నోరు విప్పింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి, కంగనాకు మధ్య వార్ మొదలైంది. కంగనా ఇంటిని, ఆఫీసును బీఎంసి కూల్చే ప్రయత్నం చేయడం లాంటి సంఘటనలతో ఇష్యూ రచ్చకు దారితీసింది.

ఇదే విషయమై మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా పోరాటానికి మద్దతుగా హీరో విశాల్ ముందుకు వచ్చాడు. సోషల్ మీడియా ద్వారా ఆమెకు ఒక లేఖను పంపారు. డియర్ కంగన… నీ గట్స్ , ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్ నీ వ్యక్తిగత సమస్య కానప్పటికీ ఒక ప్రభుత్వాన్ని నీవు ఎదుర్కొంటున్నావు. ధైర్యంగా నిలబడ్డావు. 1920లలో భగత్ సింగ్ చేసిన మాదిరి చేస్తున్నావు. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు ఎలా ప్రశ్నించాలో ప్రజలకు చూపించావు. ఒక సెలబ్రిటీ నే కాకుండా ఒక సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీసే సందేశాన్ని సమాజానికి అందించావు. నీకు వందనాలు అంటూ పేర్కొన్నాడు.