ప్రభాస్ ‘సలార్’ సినిమా గ్రాండ్ లాంఛింగ్!

82
Prabhas Salaar Movie Launch Photos and shooting update

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. వరుసపెట్టి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో త్వరలో షూటింగ్ ప్రారంభించనున్న ఈ సినిమా ఈ రోజే చాలా గ్రాండ్ గా లాంఛ్ అయింది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నేటి ఉదయం (శుక్రవారం) 11 గంటలకు చిత్రయూనిట్ సమక్షంలో జరిగింది. దీంతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాలను లైన్‌లో పెట్టారు ప్రభాస్.

Salaar Movie Launch Photos click Here

హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ‘సలార్’ చిత్రాన్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి ‘కేజీఎఫ్’ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న కన్నడ హీరో యశ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.. దీంతో ప్రభాస్- యశ్ కలిసి దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ లిస్ట్ లో ఉన్న మరో పాన్ ఇండియా సినిమా కోసం దేశం మొత్తం చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తోంది.

విజ‌య్ కిర‌గందూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది. మరోవైపు ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధమవుతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.