Heroine Janhvi Kapoor Fix For Ntr- Trivikram Movie

NTR 30 : ఎన్టీఆర్ (NTR)- త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) క్రేజీ కాంబోలో రాబోతున్న సినిమాపై కీలక అప్‌డేట్ బయటకొచ్చింది. అంతా అనుకున్నట్లుగానే ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్‌ని (Janhvi Kapoor) ఫిక్స్ చేసిన త్రివిక్రమ్ పక్కా ప్లాన్ చేశారట. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత తాజాగా NTR30 పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

అయితే లాక్‌డౌన్ కారణంగా విరామ సమయం దొరకడంతో స్క్రిప్ట్‌ని మెరుగులు దిద్దుతూ నటీనటుల ఎంపికపై ఫోకస్ పెట్టారట. ఈ క్రమంలో ఎన్టీఆర్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ని ఫైనల్ చేసేశారని తెలుస్తోంది. హారిక అండ్ హాసినీ బ్యానర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

ఇక ఈ మూవీలో మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని తెలుస్తోంది. అయితే అది మాస్ క్యారెక్టర్ కావడంతో ఆ ఛాన్స్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్‌కి ఇచ్చారని అంటున్నారు. అతిత్వరలో హీరోయిన్స్ విషయమై అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారట మేకర్స్. ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పిరియాడిక్ ఫిల్మ్ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్నాడు.