‘అఖిల్ 5వ’ సినిమాకు హీరోయిన్ ఫిక్స్..!

0
3893
Mumbai Model Sakshi Vidya To Pair Up With Hero Akhil next

అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అఖిల్‏కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావోస్తున్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ లో హిట్టు కోసం పరితపిస్తున్న స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో అఖిల్ మొదటి స్థానంలో ఉంటాడు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమా తర్వాత అఖిల్ 5 అనే సినిమాలో నటించబోతున్నాడు..ఈ ప్రాజెక్టు వచ్చే నెల నుంచి మొదలు కానుంది. ఒక్కసారి షూటింగ్ మొదలు పెడితే మళ్ళీ ఆగకూడదు అనేలా రెడీ అవుతున్నారట.

ఈ యంగ్ హీరో. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే దర్శకుడు హీరోతో హార్స్ రైడింగ్ కు సంబంధించిన స్టంట్స్ నేర్పిస్తున్నాడు. వీలైనంత వరకు షూటింగ్ సులభంగా ఫినిష్ అయ్యేలా ముందే ప్రాక్టీస్ చేసుకుంటున్నారట. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాలో అఖిల్ సరసన నటించే హీరోయిన్ పేరు మాత్రం తెలియలేదు. తాజా సమాచారం ప్రకారం మోడల్ కమ్ హీరోయిన్ సాక్షి వైధ్య నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫోటో షూట్ చేయడంతోపాటు.. టెస్ట్ షూటింగ్‏లో కూడా పాల్గొందంట ఈ ముద్దుగుమ్మ.

దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ 5 సినిమా కోసం సాక్షి వైధ్య సరిగ్గా సరిపోతుందని.. తనను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని పూర్తైన వెంటనే చిత్రీకరణ ప్రారంభించాలని భావిస్తున్నారట.  ఇక షూటింగ్ మొదలయ్యే ముందే హీరోయిన్ విషయంలో అఫీషియల్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Previous article‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..!
Next articleఐశ్వర్య మీనన్ ఫొటోస్