బాలయ్య మూవీ నుంచి మలయాళ బ్యూటీ ప్రయాగ మార్టిన్‌ ఔట్!

0
410
heroine prayaga martin removed from balakrishna Boyapati movie

BB3 Prayaga Martin: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీపై టాలీవుడ్లో భారీ నెలకొన్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు బాలయ్య సినీ కెరీర్లో సూపర్‌హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేయగా.. ఈ నెల 15వ తేదీ నుంచి బాలకృష్ణ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు.

అయిత ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా మలయాళ భామ ప్రయాగ మార్టిన్‌ను తీసుకున్నారు. తెలుగులో ప్రయాగకు ఇదే తొలి సినిమా. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. ఈ జోడీ ఎలాగుంటుందోనని యూనిట్ స్ర్కీన్ టెస్ట్ చేయగా.. బాలయ్య పక్కన ప్రయాగ మరీ చిన్నపిల్లగా కనిపించిందట.

దీంతో ఈ జోడీ బాగోలేదని నిర్ధారించుకున్న బోయపాటి ఆమెను ప్రాజెక్టు నుంచి తప్పించారట. దీంతో యూనిట్ మళ్లీ మెయిన్ హీరోయిన్ కోసం వేట ప్రారంభించింది. ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్రకు పూర్ణను ఫైనల్ చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి.

Previous articleRs 45crs for Interval action scene in RRR film
Next articleHeroine Removed From Balakrishna – Boyapati #BB3 Film!