hey idi nenena lyrical song released from solo brathuke so better

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. ఆకట్టుకుంటున్న థమన్ బాణీలతో విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కథానాయికగా నటించింది. సుబ్బు ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా `హే ఇది నేనేనా..` అంటూ సాగే పాటను విడుదల చేశారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు రఘరాం అందించిన లిరిక్స్ ప్రాణం పోశాయి. థమన్ బాణీలు మ్యూజిక్ ప్రియులకు కొత్త ఫీల్ తీసుకొచ్చాయి. ఈ సాంగ్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన సాయి ధరమ్ తేజ్.. ”అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట…ఈ పాట..” అని పేర్కొన్నారు. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుసగా చార్ట్ బస్టర్ పాటల్ని అందిస్తున్న థమన్ మరోసారి అలాంటి ఆల్బమ్ నే ఇవ్వనున్నాడన్న నమ్మకం పెరుగుతోంది.