Nani next Hi Nanna Story: దసరా సినిమా తర్వాత నాని (Nani) నటిస్తున్న సినిమా హాయ్ నాన్న. నాని కెరియర్ లో 30వ సినిమా గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. దీనికి టైటిల్ వీడియోని రీసెంట్ గా విడుదల చేయటం కూడా జరిగింది. హాయ్ నాన్న వీడియో అటు ఫాన్స్ ని అలాగే మూవీ లవర్స్ ని ఆకట్టుకుంది. అయితే నాని నటిస్తున్న హాయ్ నాన్న సినిమా స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో అలాగే వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
Nani next Hi Nanna Story: ఎమోషనల్, లవ్ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న హాయ్ నాన్న సినిమా అసలు కథ తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఇటీవల విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియోతో కొంతమంది విశ్లేషణతో కూడిన కథ వినిపిస్తుంటే మరికొందరు అది కాదు ఇది అంటూ కథనాలు రాస్తున్నారు. అయితే ఈరోజు హాయ్ నాన్న మూవీ టీం నుండి ఒక లీక్ అయితే బయటికి వచ్చింది. వచ్చిన లీక్ ప్రకారం మూవీ స్టోరీ ఇదే అంటూ ఫిలింనగర్ లో చర్చించుకుంటున్నారు.
ఇక అసలు విషయానికి వెళ్తే, హీరోయిన్గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఈ సినిమాలో హీరోయిన్ కాదు అంట. నానికి కూతురు పాత్రలో నటిస్తుందని.. ఇక హాయ్ నాన్న సినిమా స్టోరీ విషయానికి వస్తే, నాని ఈ సినిమాలో సైంటిస్ట్ గా చేస్తున్నారని చర్చ అయితే నడుస్తుంది. అలాగే నాని కూతురు మృణాల్ ఫ్యూచర్ నుండి ప్రజెంట్ కి వస్తుందంట.. ఆ సమయంలోనే తన తండ్రిని కలవడం జరుగుతుంది. అదే సమయంలో నానితో పాటు ఇంకో ఎనిమిదేళ్ల కూతురు ఉంటుంది.

ఆ విషయాన్ని గమనించిన నాని ప్రెసెంట్ నుండి ఫ్యూచర్ కి వెళ్లి ఆ సమస్యని ఎలా పరిష్కరించాడు.. దానితోపాటు నాని తన ఎనిమిదేళ్ల కూతురిని లేదంటే 25ఏళ్ల కూతురి లో ఎవరో ఒకరిని మాత్రమే ఎంచుకోవలసి వస్తుందట. మరి ఈ సమస్యని కూడా ఎలా పరిష్కరించాడు అనేదే కథ అని ఫిలింనగర్లో టాక్ అయితే నడుస్తుంది. ఒకరకంగా చూస్తే ఇదే కథ అని కూడా తెలుస్తుంది ఎందుకంటే విడుదల చేసిన టైటిల్ వీడియోలో మృణాల్ “హాయ్ నాన్న” అనే డైలాగ్ తో ముగిస్తారు.
మరి ఈ కథలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మూవీ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే మృణాల్ సినిమాలో హీరోయిన్ అని ప్రజలు అనుకుంటున్నారు. ఇది మాత్రం అందరికీ షాక్ అని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ మూవీని తెలుగు తో పాటు ఈ చిత్రాన్ని తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
Nani and Mrunal Thakur next Hi Nanna movie story revealed, Hi Nanna story, Nani next movie latest news, Hi Nanna movie latest news, Hi Nanna shooting updates