సలార్ యాక్షన్ సీక్వెన్స్ కోసం అంత ఖర్చు పెడుతున్నారా ?

ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ చేసే సినిమాల్లో ఒకటే రాధే శ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని సంక్రాంతికి రిలీజ్ చేద్దామని చూశారు కానీ అనుకోని కారణాలవల్ల పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది. అలాగే ప్రభాస్‌ పాన్ ఇండియా సినిమాల్లో ‘సలార్’ (Salaar) ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

సలార్ (Salaar) సినిమా సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియన్‌ స్క్రీన్‌పైనే మోస్ట్‌ అవైటెడ్‌ మూవీగా ‘సలార్'(Salaar) మారింది. అయితే ఈ అంచనాలను అందుకోవాలనే తపనతో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ చిత్రానికి సంబంధించి ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ కావడం లేదు అంట. సలార్ (Salaar) యాక్షన్ సీక్వెన్స్ కోసం సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది.

బొగ్గు గనుల మాఫియా నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో (Salaar budget) నిర్మాణం జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శృతి హాసన్‌ నటించనుంది.

Related Articles

Telugu Articles

Movie Articles