high court big shock to ram gopal varma due to kamma rajyam lo kadapa redlu title issue
high court big shock to ram gopal varma due to kamma rajyam lo kadapa redlu title issue

ఇన్ని రోజులు తనకు నచ్చినట్లు సినిమాలు తీసుకుంటూ వెళ్ళాడు వివాదాస్పద దర్శకుడు వర్మ. ఎందరినో టచ్ చేసినా కూడా.. ఎలాగోలా సినిమా హాల్స్ లో రిలీజ్ చేయగలిగాడు. కానీ ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విషయంలో వర్మ అనుకున్నది జరగలేదు. సెన్సార్ వాళ్ళు ఈ సినిమాను చూసి షాక్ తిన్నారంటే ఎంతమందిని కెలికాడో వర్మ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు.. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు, వివాదాస్పద అంశాలున్నాయని అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖులను కించపరిచే సన్నివేశాలు ఉన్న కారణంగా ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేమని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. అంతేకాకుండా కొందరు నాయకుల దగ్గర నుండి క్లీన్ చిట్ తీసుకొని రమ్మని చెప్పారంటూ వస్తున్న వార్తలు కూడా కలవరపెడుతున్నాయి.

దీంతో సెన్సార్‌ బోర్డ్‌ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు వర్మ. మేం ఎలాంటి సినిమాలు చూడాలో వారు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. నన్ను ఎంత తొక్కితే అంత రెచ్చిపోతానని వ్యాఖ్యలు చేశారు. సెన్సార్ ఒక అవుట్ డేటెడ్ అని ఆయన అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయడం కష్టంగానే కనిపిస్తోంది. ఏదైనా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కు వర్మ సినిమాను అమ్మేసినా అమ్మేస్తాడు అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే ఇలా వర్మ సినిమాలు కొన్ని థియేటర్లలో రిలీజ్ కు నోచుకోలేదు. ఇప్పుడు ఇది కూడా ఆ లిస్టులో చేరిపోతుందా అని ఊహాగానాలు మొదలయ్యాయి.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం చూసినప్పుడు ఈ సినిమా ఐడియా వచ్చిందని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఓ మెసేజ్‌ ఓరియంటెడ్ సినిమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపించటం లేదనీ.. కేవలం కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేసుకున్నానన్నారు. తాను ఎవరినీ టార్గెట్‌ చేసి సినిమా చేయనని కేవలం తనకు ఇంట్రస్టింగ్‌గా అనిపించిన పాయింట్‌ను మాత్రమే సినిమాగా తెరకెక్కిస్తానని అన్నారు వర్మ.

క్రైమ్‌ కన్నా.. పొలిటికల్‌ క్రైమ్‌ మరింత ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ అని కూడా అన్నారు వర్మ. ఈ సినిమాను ఓ ప్రముఖ తండ్రి కొడుకులకు అంకిత ఇవ్వనున్నానన్నారు. అయితే వారి పేర్లు మాత్రం అడగవద్దన్నారు. తనకు చిన్నప్పటి నుంచి గిల్లటం అంటే ఇష్టమని.. ఎవరైనా పొగిడితే నిద్రొచ్చేస్తుందని.. బాగా తిట్టించుకోవటం తనకు ఇష్టమని.. అందుకే ఇలాంటి సినిమాలు చేస్తున్నానని కొద్ది రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి వర్మ కామెంట్లు చేశారు.