డిజిటల్ & శాటిలైట్ రైట్స్ లో మహేష్ సరికొత్త రికార్డ్ !

0
735
High demand for Mahesh Babu Sarkaru vaari paata digital and satellite rights

కరోనా ప్రభావం తగ్గిన తర్వాత టాలీవుడ్ లో హీరోలందరూ సూపర్ ఫామ్ లో కొనసాగుతుండగా, వారి నుండి వస్తున్న న్యూ మూవీస్ విడుదలకు ముందే మంచి ధరలకు అమ్ముడవుతూ నిర్మాతలని సేఫ్ చేస్తున్నాయి. సర్కారు వారి పాట 2022 పొంగల్ భరిలో నిలవబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే మహేష్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు.

తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ డిజిటల్ & శాటిలైట్ రైట్స్ కలిపి 32-35 కోట్ల మధ్యలో అమ్ముడైనట్లు తెలుస్తుంది. ఇది మహేష్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక రేట్ అని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ఆడియెన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మార్గంలో అత్యదిక ధర పలికించిన సినిమాగా SVP నిలవడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ పై కూడా అంచనాల డోస్ పెరిగింది. వంశి పైడిపల్లి, మహేష్ కాంబినేషన్లో వచ్చిన మహర్షి మూవీ రైట్స్ రూపంలో 27.5 కోట్లు సంపాదించి రికార్డు నమోదు చేయగా ఇప్పుడు SVP మూవీ దాన్ని మించి చేసింది.

ఇక ఇప్పటివరకు తెలుగు మూవీ ఇండస్ట్రీలో వినయ విధేయ రామ 25 కోట్లు, F-2 25 కోట్లు, సరిలేరు నీకెవ్వరూ 24 కోట్లు, అరవింద సమేత వీర రాఘవ 23 కోట్లు, ఆలా వైకుంఠ పురములో 21 కోట్లు ధరలకు డిజిటల్ & శాటిలైట్ రైట్స్ మార్కెట్ చేసి SVP, మహర్షి మూవీ తర్వాత వరుసలో ఉన్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.