ఆర్ఆర్ మూవీ తో ప్రైసెస్ రాజమౌళి ప్రపంచ స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ లో ఉండటం వల్ల కొన్ని నెలలుగా రాజమౌళి అమెరికాలో ఉంటూ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ల పాల్గొన్నారు. చివరకు ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ రావడంతో రాజమౌళి స్థాయి ప్రపంచమంతా వ్యాపించింది. ఇప్పుడు అందరి దృష్టి.. జక్కన్న నెక్ట్స్ సినిమాపైనే ఉంది.
అమెరికా నుండి తిరిగి వచ్చిన రాజమౌళి రెండు నెలలు విరామం తీసుకున్న తర్వాత తన రాబోయే సినిమా మహేష్ బాబు SSMB29 పనులు మొదలు పెడతారని తెలుస్తుంది. మహేష్ బాబు SSMB29 హీరోయిన్ కి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇప్పటికే SSMB29 కోసం హాలీవుడ్ సంస్థలతో అలాగే టెక్నీషియన్స్ తో అగ్రిమెంట్ చేసుకున్నాడు రాజమౌళి.
అలాగే ఈ మధ్య మహేష్ బాబు సినిమా ప్రచారం కోసం అని నెట్ ఫ్లెక్స్ అధినేతతో కూడా చర్చలు జరిపిన విషయము సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా SSMB29 సినిమాకి హీరోయిన్ గా హాలీవుడ్ భామను రంగంలోకి దించుతున్నట్టు సమాచారం. హీరోయిన్ జెన్నా ఒర్టెగా (Jenna Ortega) తో రాజమౌళి సంప్రదింపులు చేసినట్టు పుకార్లైతే వినపడుతున్నాయి. ఇది తెలుసుకున్న మూవీ లవర్స్ అలాగే మీడియా సంస్థలు జక్కన్న ప్లాను మామూలుగా లేదు అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
అలాగే మహేష్ బాబు సినిమా కోసం అని థోర్ మూవీ యాక్టర్ క్రిస్ హెమ్స్ వర్త్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. దీని మీద మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఈ సినిమా జేమ్స్ బాండ్, ఇండియానా జోన్స్ తరహా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది.
SSMB29 సినిమా కోసం సుమారు 700 కోట్ల బడ్జెట్ అని ఫిలిం నగర్ లో టాక్ అయితే వినపడుతుంది అలాగే ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు హీరోయిన్ సంబంధించిన విషయాలు మరికొన్ని రోజులు పోతే గాని మనకి పూర్తిగా తెలియదు.
Wednesday actress Jenna Ortega to romance Mahesh Babu in SSMB29. Hollywood Heroine for mahesh Babu Rajamouli next SSMB29. SSMB29 Heroine. Hollywood heroine for SSMB29.