Homeట్రెండింగ్Salaar Action: ప్రభాస్ కోసం తగ్గేదే లే...హాలీవుడ్ కొరియోగ్రాఫర్

Salaar Action: ప్రభాస్ కోసం తగ్గేదే లే…హాలీవుడ్ కొరియోగ్రాఫర్

Salaar Action episodes: ప్రభాస్ సాలార్ మూవీ ని అత్యంత భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో చిత్రీకరణ చేస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం సాలార్ షూటింగ్ హైదరాబాద్ లో గ్యాప్ లేకుండా నడుస్తుంది. దీనికోసం కెజిఎఫ్ టీమ్ మొత్తం 24/7 పని చేస్తున్నారు. సాలార్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఎల్బీ ఇచ్చినట్టు సమాచారం అందుతుంది.

Prabhas Salaar Action episodes: ప్రభాస్ సాలార్ మూవీ లో దాదాపు 8 ఫైట్ సీన్స్ ఉన్నట్టు.. వీటిలో దాదాపు కేజీఅఫ్ స్టంట్ మాస్టర్స్ చిత్రీకరణ చేయగా.. సాలార్ మూవీ లో కీలక సన్నివేశాల్లో వచ్చే ఫైట్ కోసం పాపులర్ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ని బరిలో దించేస్తున్నారని తెలిసింది.

హాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆల్రెడీ ప్రభాస్ అలాగే ప్రశాంత్ నీల్ తో ఈ ఫైట్ సీన్స్ గురించి ప్రీ షూట్ కూడా చేసినట్టు సమాచారం అందుతుంది. దీనిని బట్టి ఆలోచిస్తే ప్రశాంత్ నీల్ ఖర్చుకు వెనకాడకుండా సినిమాకి కావాల్సిన అన్ని హంగులన్నీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

hollywood stunt choreographer for Salaar movie

ప్రభాస్ సాలార్ మూవీ లో శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శృతి హాసన్ పాత్ర ఇందులో ఎంతో ట్రాజిక్ గా ఎంతో ఎమోషన్ ని రగిలిస్తుందని మూవీ టీమ్ నుంచి సమాచారం. సాలార్ మూవీ ని హోంబలే ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో నటుడు పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పృద్విరాజ్ కూడా షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని.. సాలార్ మూవీ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా జరిగింది. సాలార్ మూవీ ని 28 సెప్టెంబర్ 2023న విడుదల కు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.

- Advertisement -

 

Related Articles

Telugu Articles

Movie Articles