Prabhas Project K Update: బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సాలార్ అలాగే ప్రాజెక్ట్ కె పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో లో ప్రాజెక్ట్ కే సినిమాని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.
టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి నాగ్ అశ్విన్ హాలీవుడ్ కి దీటుగా యాక్షన్ సన్నివేశాలను కూడా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని నెలల క్రితం ఆనంద్ మహీంద్రాని ప్రత్యేక వాహనాల కోసం నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ చేయడం. ఆయన ట్విట్టర్ వేదికగా ఎస్ అని చెప్పి వాహనాలన్నీ ప్రొవైడ్ చేశారు.
Prabhas Project K సినిమా ని 500 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న సంగతి కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్ని రూపొందించడానికి హాలీవుడ్ నుంచి ఐదుగురు ఫైట్ మాస్టర్స్ ని ఇండియా కి రప్పించారట.
టైం ట్రావెల్ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సినిమా లో భవిష్యత్తులో సంభవించే థర్డ్ వరల్డ్ వార్ సన్నివేశాలు కూడా ఈ మూవీలో అత్యంత కీలకం గా చూపించబోతున్నాడు అంట నాగ్ అశ్విన్. ఈ సినిమాలో కీలకమైన ఐదు ఫైట్ కోసం బడ్జెట్లో సగ భాగం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తామని చెబుతున్నారు. ఇదొక విజువల్ వండర్ గా వుంటుందని ఇందు కోసం బ్లూ అండ్ గ్రీన్ కోమాటిక్ టెక్నాలజీని వాడబోతున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో దీపికా పదుకోన్ దిషా పటాని హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో ఏం చేస్తున్నారు. ప్రాజెక్ట్ కే సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా సి. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.