Honey Rose key role in Pawan Kalyan next movie, Honey Rose in Ustaad Bhagat Singh movie, Ustaad Bhagat Singh Shooting update, Honey Rose Hot images, Honey Rose upcoming movie news.
బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ హనీ రోజు. తెలుగులో తన మొదటి సినిమా శివాజీ హీరోగా ఆలయంతో మొదలైంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో విజయాలు దక్కలేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ వీరాసింహారెడ్డి సినిమాలో ఒక పాటలో కనిపించి ఓవర్ నైట్ లో స్టార్ డం దక్కించుకుంది.

35 ఏళ్ల వయసు ఉన్న హనీ రోజ్ (Honey Rose) తన అంద చందాలతో ఇంస్టాగ్రామ్ అలాగే మిగతా సోషల్ మీడియాలో తన ఫోటోలు అలాగే వీడియోలతో కుర్ర కారుని ఊపేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ సినిమాలో హనీ రోజు కి కీలకమైన పాత్రలో నటించే అవకాశం దక్కినట్టు తెలుస్తుంది .
ఇక వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ (pawan Kalyan) అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హనీ రోజుకి ఛాన్స్ దక్కిందంటూ సోషల్ మీడియాలో న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. హనీ (Honey Rose) అనగానే బోల్డ్ క్యారెక్టర్ అనుకుంటారు.. కానీ పవన్ సినిమాలో ఆమె చాలా సిన్సియర్ రోల్ చేస్తుందట.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా శ్రీ లీల (Sreeleela) చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ పక్కన హనీ రోజుకి (Honey Rose) ఛాన్స్ దక్కిందంటే తన దశ తిరిగినట్టే అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ అలాగే మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ విషయానికి వస్తే రీసెంట్ గానే యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన షూట్ కంప్లీట్ చేసినట్టు దర్శకుడు హరి శంకర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది.

హరి శంకర్ అలాగే పవన్ కళ్యాణ్ రెండో సారి కలిసి చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఫ్యాన్స్ కు భారీగానే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పొలిటికల్ టూర్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సంబంధించిన సినిమాలన్నీ రాబోయే 2024 ఎలక్షన్స్ తర్వాతే విడుదల అవుతాయని ఒక టాక్ అయితే ఫిలింనగర్ లో వినిపిస్తుంది. ఇక హనీ రోజ్ పాత్రకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై ఇంతవరకు మేకర్స్ నుండి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు.
