పవన్ సినిమాలో ఈ గ్లామరస్ యాంకర్..!

1660
Hot Anchor Anasuya important role in Pawan Krish movie

యాంకర్ అనసూయ మొన్నటివరకు టీవీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. సినిమాలకు తక్కువ ప్రయారిటీ ఇచ్చింది. సినిమా కథల విషయంలో ఆమె గిరి గీసుకుంది. అందుకే అవకాశాలు తగ్గాయి. కానీ ఇప్పుడు అనసూయ సినిమాలపై పూర్తి దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను రీఎంట్రీ ఇచ్చిన చిత్రం “వకీల్ సాబ్” షూట్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆలాగే దర్శకుడు క్రిష్ తో పవన్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను కూడా మొదలు పెట్టేసారు. భారీ బడ్జెట్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి. మరి లేటెస్ట్ గా ఈ సినిమాపై మరో టాక్ వినిపిస్తుంది. ఓ కీలక పాత్రలో అనసూయను తీసుకున్నట్టు ప్రచారం నడుస్తోంది. రీసెంట్ గా అనసూయకు తన పాత్రకు సంబంధించి నెరేషన్ ఇచ్చాడట దర్శకుడు క్రిష్. క్యారెక్టర్ నచ్చడంతో అనసూయ వెంటనే అంగీకరించిందని టాక్.

Anasuya Bharadwaj role in Pawan Kalyan PSPK 27

ఇప్పటికే సునీల్ హీరోగా రాబోతున్న వేదాంతం రాఘవయ్య మూవీలో అనసూయ నటిస్తోంది. దీంతోపాటు రవితేజ ఖిలాడీలో కూడా ఆమె కనిపించనుంది. అటు విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న ఓ తమిళ సినిమాలో కూడా అనసూయ ఉంది. ఇప్పుడు వీటికి అదనంగా పవన్ కల్యాణ్ మూవీలో కూడా కనిపించనుంది ఈ బ్యూటీ.