ఆకట్టుకుంటున్న మహా సముద్రం మెలోడీ సాంగ్..!

0
55
Hot Beauty Aditi Rao Hydari Cheppake Cheppake Lyrical Song From Maha Samudram

Mahasamudram Songs: “మహా సముద్రం” నుండి వచ్చిన మొదటి పాట “హే రంభ”కు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా “మహా సముద్రం” నుంచి మేకర్స్ సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. “చెప్పకే చెప్పకే” అంటూ మంచి మెలోడీ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

శర్వానంద్‌-సిద్దార్థ్‌ ప్రధాన పాత్రల్లో అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మహా సముద్రం’. ఇంటెన్స్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈసినిమాలో ఆదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ బ్యూటిఫుల్ మెలోడీలో బీచ్‌ సైడ్‌లో చిత్రీకరించిన విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.

ఈ సాంగ్ మేకింగ్ వీడియో ఇంటరెస్టింగ్ గా ఉంది. అయితే ఈ మేకింగ్ వీడియో మధ్యలో శర్వానంద్ ఇంటికి అను ఇమ్మాన్యుయేల్ రావడం ఆసక్తికరంగా మారింది. దీంతో టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

Cheppake Cheppake Lyrical Song From Maha Samudram film

ఈ సినిమా నుంచి సోమవారం ఉదయం ‘చెప్పకే చెప్పకే’ అంటూ సాగే ఓ ప్రేమ పాటను రష్మిక విడుదల చేశారు. ‘ఈ ఫీల్‌గుడ్‌ ప్రేమ పాట నాకు బాగా నచ్చింది. చిత్రబృందం మొత్తానికి ఆల్‌ ది బెస్ట్‌. శర్వా ఇటీవల నాకు సినిమా ట్రైలర్‌ కూడా చూపించారు. మీ అందరూ అదరగొట్టేశారు’ అని రష్మిక పేర్కొన్నారు.

 

Previous articleCheppake Cheppake Lyrical Song From Maha Samudram
Next articleమొదటివారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారంటే..!