అదిరిపోయిన ప్లే బ్యాక్ ట్రైలర్

0
28
Hot Beauty Ananya Nagalla Playback trailer released on Aha OTT

Playback Trailer: వన్ నేనొక్కడినే లాంటి అద్భుతమైన కథ ను ప్రేక్షకులకు అందించిన రచయిత హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో రాబోతున్న సినిమా ప్లే బ్యాక్. ‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా.. ‘మల్లేశం’ ‘వకీల్ సాబ్’ సినిమాలతో ఆకట్టుకున్న అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించిన చిత్రం ”ప్లే బ్యాక్”. ఒకే సారి రెండు వేర్వేరు సమయాల్లో జరిగిన కథను చూపించేందుకు హరి ప్రసాద్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రాస్ టైం కనెక్షన్ మీద ఇప్పటివరకు ఏ చిత్రం రాలేదు. ఒకరికి గతం.. మరొకరికి భవిష్యత్తు అనే కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా బయటకు వచ్చింది.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలో విడుదల చేస్తున్నారు. తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో మే 21 నుంచి ”ప్లే బ్యాక్” మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో అనన్య నాగళ్ల గతంలో ఉండగా.. దినేష్ తేజ్ భవిష్యత్తులో ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్య లింక్ ఓ కనెక్షన్ లేని ల్యాండ్ లైన్ ఫోన్. ట్రైలర్‌లోనే సినిమా ఎలా ఉండబోతోందో ఓ క్లారిటీ ఇచ్చారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగనున్నట్టు కనిపిస్తోంది. అయితే గతంలో ఏం జరిగింది.. చనిపోయి 25 ఏళ్లు అవుతున్నా కూడా మళ్లీ ఎలా కలిశారు.. అసలు దీని వెనుకున్న లాజిక్స్ ఏంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Read Also: తమన్నా ‘నవంబర్ స్టోరీ’ ట్రైలర్

రెండు టైమ్ లైన్స్ ను కలపాలి అనుకుంటే ఏం జరుగుతుందనే పాయింట్ తో వచ్చిన ఈ ‘ప్లే బ్యాక్’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దీనికి సినిమాటోగ్రాఫర్ కె.బుజ్జి అందించిన విజువల్స్.. మ్యూజిక్ డైరెక్టర్ కామ్రన్ అందించిన నేపథ్య సంగీతం బాగున్నాయి. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రసాద్ రావు పెద్దినేని ‘ప్లే బ్యాక్’ చిత్రాన్ని నిర్మించారు.

Read Also: వైష్ణ‌వ్ తేజ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

Watch Here For Playback Trailer