Hot Beauty Urvashi Rautela lost her gold iphone at Ind vs pak match, Urvashi Rautela tweet viral, Urvashi Rautela latest videos, Urvashi Rautela lost phone
చేతిలో ఎప్పుడూ ఉండే ఫోను పోతే ఆ బాధ పోగొట్టుకున్న వాళ్లకే తెలుస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి బాలీవుడ్ బ్యూటీ అయినా ఊర్వశి రౌతేలా కి ఎదురైంది. సండే రోజు జరిగిన ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ సిరీస్ కి వెళ్ళిన బాలీవుడ్ బ్యూటీ తన గోల్డ్ ఐఫోన్ (Gold Iphone) ని అక్కడ పోగొట్టుకోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
పాకిస్తాన్ అలాగే ఇండియా వరల్డ్ కప్ సిరీస్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రికెట్ మ్యాచ్ ని చూడటానికి అన్ని ప్రాంతాల నుండి సెలబ్రిటీస్ వెళ్లడం జరిగింది.. వాళ్లలో హాట్ బ్యూటీ అయిన ఊర్వశి రౌతేలా ల కూడా వెళ్లారు.. అయితే అక్కడ తన ఖరీదైన 24 క్యారెట్ గోల్డ్ ఐఫోన్ ని పోగొట్టుకోవడం జరిగింది.. ఈ ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ని అటాచ్ చేసి తెలియజేశారు.
ఊర్వశి రౌతేలా పోగొట్టుకున్న గోల్డ్ ఐఫోన్ ఖరీదు చూస్తే దాదాపు 2,50,000 పైనే ఉంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలియజేస్తూ..ఎవరికైనా నా ఫోన్ దొరికితే నన్ను సంప్రదించండి అని కోరింది. అలాగే దీనితోపాటు అహ్మదాబాద్ పోలీసులను ట్యాగ్ చేయడంతో వాళ్లు రెస్పాండ్ అయ్యి ఫోన్ వివరాలను తెలపండి అంటూ మెసేజ్ చేయడం జరిగింది.. పోలీస్ కంప్లైట్ ఇచ్చిన కాపీని కూడా ఊర్వశి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..
మరి ఆ ఫోను పోగొట్టుకుందా..? లేదంటే ఎవరైనా కొట్టేశారా..? అనే విషయాన్ని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం ఈ మ్యాటర్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామంది ఫాన్స్ వివిధ రకాలుగా పోస్ట్ కి కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఊర్వశి రౌతేలా సినిమాల విషయానికి వస్తే, ఈ సంవత్సరం టాలీవుడ్ లో వాల్తేరు వీరయ్య, స్కంద, ఏజెంట్, బ్రో సినిమాలలో కనిపించిన ఊర్వసి ప్రస్తుతం బాలీవుడ్ లో దిల్‍హై గ్రే అనే సినిమాలో చేస్తున్నారు.